»British Prime Minister Rishi Sunaks Couples Assets Have Grown Enormously How Much
Rishi Sunak: భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు.. ఎంతంటే?
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతా మూర్తిల సంపాదన గతేడాది అమాంతం పెరిగింది. బ్రిటన్‌లో ఆర్థిక సంక్షోభం కారణంగా బిలియనీర్ల సంపద తరిగిపోతే వీళ్ల సంపద మాత్రం పెరగడం గమనార్హం.
British Prime Minister Rishi Sunak's couple's assets have grown enormously.. How much?
Rishi Sunak: బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతా మూర్తి ఆస్తులు అనుహ్యరీతిలో పెరిగాయి. గతేడాది ఈ దంపతుల ఆస్తి సుమారు 120 మిలియన్ పౌండ్లు పెరిగినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం వీరి ఆస్తి సుమారు 651 మిలియన్ పౌండ్లకు చేరుకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. మునుపటి సంవత్సరం వీరి ఆస్తి 529 మిలియన్ పౌండ్లుగా ఉంది. ఇప్పుడు 651 మిలియన్ పౌండ్లకు చేరిందని పేర్కొంది. అయితే బ్రిటన్‌లోని ఆర్థిక సంక్షోభం కారణంగా బిలియనీర్ల ఆస్తులన్ని తరగిపోగా.. ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు పెరగడం గమనార్హం.
ఇండియాలో ప్రముఖ ఇన్ఫోసిస్ వ్యవస్థపాకుడు నారాయణ మూర్తి కంపెనీలో ప్రధాని దంపతులు షేర్లు పెట్టడమే వారి ఆస్తి పెరుగుదలకు కారణం అని అంచనా వేస్తున్నారు. ఈ కంపెనీలో అక్షత షేర్లు సుమారు 108.8 మిలియన్ పౌండ్లకు పెరిగినట్లు తెలుస్తోంది. సునాక్ దంపతులే కాకుండా కింగ్ ఛార్లెస్ ఆస్తులు కూడా పెరిగాయి. పోయిన సంవత్సరం 600 మిలియన్ పౌండ్ల నుంచి 610 మిలియన్ పౌండ్లకు పెరిగింది. యూకేలో హిందూజ గ్రూప్‌ను పర్యవేక్షిస్తున్న గోపి హిందూజ బిలియనీర్ల జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.