పదో తరగతి, ఇంటర్ చదువుకుంటే చాలు. నేవీలో అగ్నివీర్ పోస్టులకు అర్హులు అయినట్లే. మహిళలు కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Navy Agniveer Recruitment 2024 : భారత నౌకాదళంలో పని చేసేందుకు గాను అగ్నివీర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అయితే ఇవి పర్మినెంటు ఉద్యోగాలు కావు. నాలుగు సంవత్సరాలు మాత్రమే విధులు నిర్వర్తిస్తారు. తర్వాత ఇందులో 25 శాతం మందిని మాత్రమే పూర్తి స్థాయి ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. నాలుగేళ్ల సమయంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మాత్రం నేవీ సెయిలర్ హోదా కల్పిస్తారు. రెగ్యులర్ జాబ్‌లోకి తీసుకుంటారు. వీరికి సాధారణ నేవీ ఉద్యోగుల మాదిరిగానే ప్రయోజనాలు, పింఛను లాంటివి అన్నీ ఉంటాయి.
ఇక ఈ అగ్నివీర్(AGNIVEER ) పోస్టుల కోసం మహిళలు, పురుషులు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఎంఆర్, ఎస్ఎస్ఆర్ పోస్టులకు విడివిడిగా పరీక్షలు ఉంటాయి. స్టేజ్ వన్, స్టేజ్ 2 పరీక్షలు రాసిన తర్వాత ఫిజికల్ టెస్టు చేస్తారు. అందులో ఎంపికైన వారికి మళ్లీ పరీక్ష ఉంటుంది. అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. వారిలో అర్హలకు శిక్షణ ఇస్తారు. ప్రారంభ జీతం రూ.30000. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మే 27, 2024
ఎంఆర్ పోస్టుల కోసం అభ్యర్థులు 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే 2003 నవంబర్ ఒకటి నుంచి 2007 ఏప్రిల్ 30 మధ్య జన్మించినవారై ఉండాలి. రూ.649 అప్లికేషన్ ఫీజు చెల్లించి https://www.joinindiannavy.gov.in/ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
అలాగే ఎస్ఎస్ఆర్ పోస్టుల కోసం ఇంటర్లో గణితం, భౌతిక శాస్త్రం సబ్జెక్టులుగా 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నీలజీ్లో 50 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. లేదా 50 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో రెండేళ్ల ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసి ఉండాలి. పైన పేర్కొన్న కాలంలోనే వీరు కూడా జన్మించి ఉండాలి.