కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ కింద ఎంపికైన వారిని అగ్నివీర్ లని అంటారు. ఈ పథకానికి సంబంధించి తాజాగా కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీరులకు ఉపయోగపడే కొన్ని మార్పులను తీసుకొచ్చినట్లు తెలిపింది. అగ్రివీర్ల కాల పరిమతిని, వారి వయోపరిమితిని పెంచేందుకు కేంద్రం ఆలోచిస్తోంది. ఇప్పుడున్న నిబంధనల ప్రకారంగా ఈ పథకంలో ఎంపికైన యువతలో కేవలం 25 శాతం మందికే నాలుగేళ్ల తర్వాత ఆర్మీలో రెగ్యులరైజ్ చేస్తారు. కానీ ఇకపై ఈ 25 శాతం నుంచి 50 శాతానికి ఆర్మీలోని రెగ్యులర్ క్యాడర్లలో తీసుకొనేలా కేంద్రం నిర్ణయించింది.
సాంకేతిక నేపథ్యం ఉన్న యువకులను తీసుకోవడం, గరిష్ఠ వయస్సును 21 నుంచి 23 ఏళ్లకు పెంచేందుకు కేంద్రం ఆలోచిస్తోంది. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. 2022 జూన్‌లో ప్రారంభించిన అగ్నిపథ్ పథకం కింద 17.5-21 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులను అగ్నివీర్ల పోస్టులకు తీసుకోనున్నారు. ప్రస్తుతం వయో పరిమితిని పెంచేందుకు చర్చలు జరుగుతున్నాయి.
2026 నాటికి దాదాపు 1.75 లక్షల మంది యువకులను అగ్నిపథ్ స్కీమ్ కింద చేరనున్నట్లు కేంద్రం అంచనా వేసింది. మరో విషయం ఏంటంటే ప్రతీ ఏడాది దాదాపు 60 వేల మంది సైనికులు రిటైర్ అవుతుండగా మూడు దళాల్లోనూ సైనికుల కొరత తీవ్రంగా ఏర్పడుతోంది. అందుకే అగ్నిపథ్ స్కీమ్‌లో మార్పులు చేస్తి అగ్నివీర్ లను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.