భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) కొత్త రూల్ తీసుకొచ్చింది. క్రికెటర్లలో ఈ మధ్యకాలంలో బ్యాటర్ల ఆధిపత్యం ఎక్కువవుతోంది. దీంతో టీ20(T20)ల్లో బ్యాట్, బాల్ మధ్య సమతుల్యతను కాపాడేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బౌలర్లు ఒక ఓవర్‌కు రెండు బౌన్సర్ల(Two Bouncers per over )ను వేసే అవకాశాన్ని కల్పిస్తూ ప్రకటన చేసింది. త్వరలో ప్రారంభం కానున్న సమ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ నుంచే ఈ నిబంధనను అమలు చేయనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.
అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ ఓవర్‌కు ఒక్క బౌన్సర్(Bouncers) మాత్రమే వేసే అవకాశం ఉంది. అలాగే ఓవర్లో రెండో బంతి బౌన్సర్ వేస్తే దానిని నో బాల్‌గా ప్రకటించడం తెలిసిందే. ఇకపై ఆ రూల్(Rule) మారనుంది. ఓవర్లో రెండు బౌన్సర్ల(Bouncers)ను బౌలర్లు వేయనున్నారు.
కొత్త రూల్(New Rule)తో పాటుగా మరో ఇంపాక్ట్ ప్లేయర్(Impact Player) నిబంధనల్లోనూ బీసీసీఐ(BCCI) మార్పులు చేస్తూ ప్రకటించింది. ఐపీఎల్ 2023లో ఇంపాక్ట్ ప్లేయర్ విధానం సక్సెస్ అయ్యింది. మ్యాచ్ మొదలైనప్పటి నుంచి ఇంపాక్ట్ ప్లేయర్‌ను రంగంలోకి ఎప్పుడైనా దించవచ్చు. దీని కోసం టాస్కు ముందుగానే ఎలెవన్ తో పాటుగా నలుగురు సబ్‌స్టిట్యూట్ ప్లేయర్స్ ను ఎంచుకోవాలి. ముస్తాక్ అలీ టోర్నీలో ఈ విధానాన్ని పరిశీలించనున్నారు. అది సక్సెస్ అయితే అన్ని ఫార్మాట్లలోనూ దీనిని అమలు చేయనున్నట్లు బీసీసీఐ తెలిపింది.