ఐఏఎస్ (IAS) కావాలన్న తన కోరిక నెరవేరకుండానే కన్నుమూశారు ప్రీతి నాయక్ (Preeti Nayak). ప్రీతి (Preeti) ఆదివారం రాత్రి 9 గంటలకు మృతి చెందినట్లు నిమ్స్ (NIMS) వైద్యులు ప్రకటించారు. ఇటీవలే ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. ఆమెకు హైదరాబాద్ నిమ్స్ (NIMS) హాస్పిటల్ లో చికిత్స అందించారు. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్ను మూశారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెంది ప్రీతి (Preeti) కాకతీయ మెడికల్ కాలేజీలో చదువుతోంది. పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతోన్న వరంగల్ ఎంజీఎం(MGM) హాస్పిటల్ లో ట్రైనింగ్ లో ఉండగా సీనియర్ విద్యార్థి సైఫ్ (Saif) వేధింపులతట్టుకోలేక తీవ్ర మనస్థాపానికి గురైన మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఐదు రోజుల తర్వాత కన్నుమూసింది. అయితే ఆమె ఐఏఎస్ కావాలని భావించింది. ఆ కల నెరవేరకుండానే కానరాని లోకాలకు వెళ్ళారు. చదువులో చాలా చురుకుగా ఉండే ప్రీతి.. ఒకసారి సివిల్స్ పరీక్ష రాసి విఫలమయ్యారు. రెండో ప్రయత్నంలో విజయం సాధిస్తాననే ధీమాతో ఉందని కుటుంబసభ్యులు కన్నీటి మున్నీరు అవుతున్నారు.
ప్రీతి మృతి పట్ల సీఎం కెసిఆర్, తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, మంత్రులు…. తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిమ్స్‌లో నిన్న ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రీతి సోదరుడికి గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని, ఆ కుటుంబానికి రూ.5 కోట్ల పరిహారం ఇవ్వాలని గిరిజన లంబాడీల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకు లేదని ప్రీతి సోదరుడు వంశీ వాపోయారు. ప్రీతి కేసులో బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆమె స్వగ్రామమైన జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండాలో ఆదివారం రాత్రి రాస్తారోకో చేశారు. ప్రీతి మృతికి సంతాపం తెలుపుతూ ఆదివారం రాత్రి కేఎంసీ వద్ద గిరిజన, ప్రజా సంఘాలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాయి.
ప్రీతి ఆత్మహత్యాయత్నానికి ముందు రోజు తన తల్లితో మాట్లాడిన వీడియో వ్వెలుగు చూసింది. సీనియర్ సైఫ్ జునియర్లను వేధిస్తున్నాడని, అందరూ బయటకు చెప్పలేక పోతున్నారని, తాను మాత్రం ఎదురు తిరిగినందుకు తనను టార్గెట్ చేశారని తల్లితో ఆందోళనగా చెప్పారు..అయితే తను వచ్చి ప్రిన్సిపల్ తో మాట్లాడుతానని తల్లి చెప్పారు. అంతలోనే ఈ ఘోరం జరిగింది. ప్రీతి బాల్యం హైదరాబాద్‌లోని గడిచింది. రైల్వే స్కూల్, జూనియర్ కాలేజీలో చదివింది. ఎంబీబీఎస్ తర్వాత కేఎంసీలో పీజీ అనస్థీషియాలో చేరింది. ప్రీతి తండ్రి రైల్వే ఏఎస్ఐ. తల్లి శారద. ప్రీతికి ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు ఉన్నారు. ప్రీతి అక్క వైశాలి ఇన్‌కమ్‌టాక్స్ ఇన్స్పెక్టర్. తమ్ముడు కేయూలో ఎంబీఏ చేస్తున్నాడు.