»Bloomberg Billionaires Index Elon Musk Richest Man In The World Again
Elon Musk: మస్క్ ఈజ్ బ్యాక్..మళ్లీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు
గత ఏడాది డిసెంబర్లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా ఎలాన్ మస్క్ తన స్థానాన్ని కోల్పోయి..తాజాగా మళ్లీ నంబర్ వన్ స్థానానికి వచ్చారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా స్టాక్స్ 100% పెరిగిన నేపథ్యంలో 187 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఎలాన్ మస్క్ తిరిగి ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచాడని నివేదికలు చెబుతున్నారు.
టెస్లా(tesla) అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) మరోసారి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా అగ్రస్థానంలో నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్(bloomberg billionaires index) ప్రకారం 187 బిలియన్ డాలర్ల నికర సంపదతో మొదటి స్థానంలో ఉన్నారు. గత ఏడాది డిసెంబర్లో ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్ CEO బెర్నార్డ్ ఆర్నాల్ట్(bernard arnault) మొదటి స్థానానికి చేరారు. ఆ క్రమంలో ఎలాన్ మస్క్ తన అగ్ర స్థానాన్ని కోల్పోయి దాదాపు రెండు నెలలు రెండో స్థానంలోనే ఉండిపోయారు. అయితే డిసెంబరు 2022లో టెస్లా(tesla) షేర్లు(shares) పడిపోవడంతో ఆర్నాల్ట్ మొదటి స్థానానికి వచ్చారు. ఆర్నాల్ట్ ప్రస్తుతం 185 బిలియన్ డాలర్లతో రెండో స్థానానికి చేరారు.
ఇక జనవరి నుంచి ఎలక్ట్రిక్ కార్ల తయారీదారు సంస్థ టెస్లా స్టాక్ ఏకంగా 100 శాతం పెరిగి $207.63 వద్ద సోమవారం ముగిసింది. మెరుగైన పెట్టుబడిదారుల డిమాండ్ తోపాటు టెస్లా వాహనాలపై రాయితీలు ఇవ్వడంతో వినియోగదారులకు మరింత ఆసక్తి పెరిగింది. దీంతో ఈ కంపెనీ స్టాక్స్(stocks) పెద్ద ఎత్తున పెరిగాయి. అయితే పెరుగుతున్న పోటీ, బలహీనమైన ఆర్థిక వ్యవస్థ కారణంగా అమ్మకాలను పెంచడానికి టెస్లా ఇటీవల ధరలను తగ్గించినట్లు తెలుస్తోంది. దీంతో ఎలక్ట్రిక్ కార్లు చవక రేటుతో లభిస్తున్నాయని పలువురు అంటున్నారు. ఈ నేపథ్యంలో 2030 నాటికి వాహన డెలివరీలను 20 మిలియన్లకు పెంచాలని టెస్లా లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం.
టెస్లా(tesla) వేగవంతమైన క్షీణత నేపథ్యంలో మస్క్ ట్విట్టర్(twitter) కొనుగోలు చేయడం మరోవైపు టెక్ రంగంలో ఆర్థిక మాంద్యం(inflation) కూడా కొనసాగుతుంది. ఈ క్రమంలో నవంబర్ 2021 నుంచి డిసెంబర్ 2022 వరకు మస్క్ $340 బిలియన్ల నికర విలువ నుంచి $137 బిలియన్లకు పడిపోయింది. దాదాపు మస్క్ $200 బిలియన్ల సంపదను కోల్పోయారు. అంతేకాదు ఇంత పెద్ద మొత్తంలో సంపదను కోల్పోయిన వ్యక్తుల్లో మొదటి స్థానం(first place)లో కూడా నిలిచారు.
2021లో బిలియనీర్ జాబితాలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్(jeff bezos)ను మస్క్ ఓడించినప్పుడు, బెజోస్ కొనసాగుతున్న పోటీకి అనేక మంది ఆమోదం తెలిపారు. మరోవైపు మస్క్(Elon Musk), ఆర్నాల్ట్(bernard arnault), బెజోస్ త్రయం నిరంతరం బిలియనీర్ జాబితా(billionaire index)లో మొదటి మూడు స్థానాలను మార్చుకుంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ సమయంలో టెస్లా షేర్ల విలువ వేగంగా క్షీణించడంతో ఆకస్మికంగా తన స్థానం మారిపోయింది. మరోవైపు చైనాలో కోవిడ్-19 ప్రభావంతో పెట్టుబడిదారుల భయాందోళనలు..దీంతోపాటు ట్విటర్‌ను మస్క్ $44 బిలియన్లు వెచ్చించి కొనుగోలు చేయడం కూడా మస్క్ వ్యాపారంపై ప్రభావం చూపింది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాన్ మస్క్ వెనక్కి తగ్గకుండా Twitter CEOను తొలగించడంతోపాటు ఈ కంపెనీలో అనేక ఖర్చులను తగ్గించాడు. అయినప్పటికీ మైక్రోబ్లాగింగ్ సైట్ ద్వారా రోజుకు దాదాపు 4 మిలియన్ డాలర్లు నష్టవస్తుందని నవంబర్‌లో ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ట్విట్టర్(twitter) కూడా క్రమంగా పుంజుకుంటే మస్క్ సంపద మరింత పెరగనుంది.