»Up Leader Thrashed By Women For Allegedly Harassing
Viral Video: రాజకీయ నాయకుడిని చెప్పుతో కొట్టిన మహిళలు
ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)లో ఓ మహిళ ఒక రాజకీయ నాయకుడి (political leader) కాలర్ పట్టుకొని, చెప్పులతో కొట్టిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో సిద్ధార్థ్ నగర్ కి చెందినది. ఈ వీడియోలో ఓ మహిళ... నాయకుడి చొక్కా పట్టుకొని కొడుతోంది.
ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)లో ఓ మహిళ ఒక రాజకీయ నాయకుడి (political leader) కాలర్ పట్టుకొని, చెప్పులతో కొట్టిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో సిద్ధార్థ్ నగర్ కి చెందినది. ఈ వీడియోలో ఓ మహిళ… నాయకుడి చొక్కా పట్టుకొని కొడుతోంది. ప్రశ్నలను సంధిస్తోంది. దీనికి అతని నుండి మాత్రం ఎలాంటి సమాధానం రావడం లేదు. చేతిలో చెప్పు పట్టుకొని, అపరకాళిలా మారిన ఆ మహిళ తన ప్రెండ్ ను పిలిచి.. పోలీసులకు ఫోన్ చేయమని సూచిస్తున్నట్లుగా వీడియోలో ఉంది. ఓ మహిళ అతని బైక్ ను అడ్డగించింది. అతను చేతిలో పట్టుకున్న ఫోన్ ను కింద పడేసింది. ఇది 1 నిమిషం 54 సెకన్ల వీడియో. అయితే అతను అధికార బాజప నేతగా ప్రచారం చేసుకుంటున్నాడు. ఏం జరిగిందనేది పూర్తిగా తెలియరాలేదు. వారిని వేధించినందుకు గాను అతనిని కొడుతున్నట్లుగా తెలుస్తోంది. మహిళలు తనను కొడుతుంటే… తిడుతుంటే ఆయన వదలమని చెప్పడం, ఫోన్ చేస్తానని చెప్పడం మినహా ఏమీ చేయలేకపోయాడు. అతనిని కొడుతున్న వీడియో మాత్రం నెట్టింట వైరల్ గా మారింది.
सिद्धार्थनगर- भाजपा नेता को महिलाओं ने बीच चौराहे पर पीटा,महिलाओं से अभद्रता कर रहा था भाजपा नेता,वीडियो सोशल मीडिया पर हो रहा वायरल,एक अन्य महिला बाइक तोड़ती आ रही नजर,सदर के स्टेशन रोड का बताया जा रहा है मामला.#Siddharthnagarpic.twitter.com/y0qCleEigH