ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం, మెసేజింగ్ యాప్ స్నాప్‌చాట్ ప్రయోగాత్మకంగా My AI చాట్‌బాట్ ఫీచర్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఇంకోవైపు ఇప్పటికే మెటా సంస్థతోపాటు జూమ్ కంపెనీ కూడా ఈ టెక్నాలజీని వారి సంస్థల్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి.
ChatGPT వచ్చిన తర్వాత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లలో పోటీ ఎక్కువైంది. ఈ క్రమంలో ఇప్పటికే మెటా(meta) సంస్థ వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్(instagram) లలో ఏఐ ఫీచర్ ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం, మెసేజింగ్ యాప్ స్నాప్‌చాట్(snapchat)లో ప్రయోగాత్మక చాట్‌బాట్ ఫీచర్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. చాట్ జీపీటీ మాదిరిగా ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీని లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించింది. My AI అని పిలువబడే చాట్‌బాట్(chatbot).. OpenAI GPT సాంకేతికతతో రూపొందించబడింది. Snapchatలో ఈ ఫీచర్ మొదట్లో ప్రయోగాత్మకంగా Snapchat+ సబ్స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. భవిష్యత్తులో ఈ చాట్‌బాట్‌ను అందరు వినియోగదారులకు అందిస్తామని ప్రకటించారు.
మరోవైపు ప్రారంభ దశలో My AI పొరపాట్లు చేయవచ్చని కంపెనీ పేర్కొంది. అయితే చాట్‌బాట్(chatbot)ద్వారా “పక్షపాతం, తప్పు, హానికరమైన లేదా తప్పుదారి పట్టించే సమాచారం” వ్యాప్తి చెందకుండా నిరోధించడమే తమ లక్ష్యమని వెల్లడించింది. Microsoft యొక్క ChatGPT లేదా Google Bard వంటి ఇతర చాట్బాట్ల మాదిరిగానే, చాట్‌బాట్ సమాచారాన్ని బహిర్గతం చేస్తుందని తెలిపింది.
ప్రయోగాత్మక చాట్‌బాట్ పనితీరును సమీక్షించడానికి అన్ని సంభాషణలను సేవ్ చేస్తున్నట్లు Snapchat పేర్కొంది. చాట్‌బాట్ కార్యాచరణను మెరుగుపరచడానికి మరిన్ని మార్పులను పరిచయం చేయడానికి వినియోగదారుల అభిప్రాయాలను కూడా స్వీకరిస్తున్నట్లు చెప్పింది. ఇంకోవైపు AI చాట్‌బాట్‌తో వ్యక్తిగత సమాచారం లేదా ఏదైనా సున్నితమైన వివరాలను పంచుకోవద్దని Snap తన వినియోగదారులకు సూచించింది.
ఇంకోవైపు AI ఆధారిత చాట్బాట్లు, ఇతర ఉత్పత్తులను రూపొందించడానికి LAMA అనే పరిశోధనా సాధనాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు Meta ఇటీవలే ప్రకటించింది. కంపెనీ సమీప భవిష్యత్తులో ఈ సాధనాన్ని AI పరిశోధకులకు అందుబాటులో ఉంచాలని భావిస్తోన్నట్లు తెలిపింది. అయితే ప్రస్తుతం WhatsApp, Facebook వంటి వాటిలో ఏఐ(ai) చాట్ బాట్ ఫీచర్లు అందుబాటులో లేవు.
మరోవైపు Zoom Video Communications Inc కూడా దాని ఉత్పత్తులలో మరింత కృత్రిమ మేధస్సును ఏకీకృతం చేయనున్నట్లు ప్రకటించింది. ఇది టెక్ పరిశ్రమలో భవిష్యత్తు వృద్ధికి దోహదం చేస్తుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో వాల్ స్ట్రీట్ అంచనాలను అధిగమించిన వార్షిక లాభాలను కూడా కంపెనీ అధిగమించింది. దీని ఫలితంగా విస్తరించిన ట్రేడింగ్ సమయంలో కంపెనీ షేర్లలో ఎనిమిది శాతం పెరుగుదల ఏర్పడింది. మాంద్యం భయాలు ఉన్న నేపథ్యంలో కూడా ఈ వృద్ధి సాధించడం విశేషమనే చెప్పాలి.