సామ్ ఆల్ట్‌మన్‌ను సిఇఒగా తిరిగి తీసుకురావడానికి కొత్త బోర్డు సభ్యులను నియమించడానికి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు OpenAI ఈరోజు ప్రకటించింది. అయితే అతన్ని తొలగించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Twist in the OpenAI Sam Altman is back as CEO with new board
గత కొన్ని రోజులుగా OpenAIలో కొనసాగుతున్న గందరగోళం ఎట్టకేలకు వీడింది. ఇటీవల వారి బోర్డ్‌రూమ్ లోకి మాజీ CEO సామ్ ఆల్ట్మాన్(Sam Altman) కంపెనీలోకి తన స్థానానికి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అతను OpenAIకి తిరిగి రావడం గురించి బుధవారం Xలో ఒక పోస్ట్ చేసిన తర్వాత కంపెనీచే ధృవీకరించబడింది. సామ్ ఆల్ట్మాన్ OpenAIకి కొత్త ప్రారంభ బోర్డ్‌తో CEOగా తిరిగి రావడానికి తాము సూత్రప్రాయంగా ఒప్పందానికి వచ్చినట్లు పేర్కొన్నారు. బ్రెట్ టేలర్ (ఛైర్), బ్రెట్ టేలర్, లారీ సమ్మర్స్, ఆడమ్ డి ఏంజెలోతో కూడిన కొత్త బోర్డు ఏర్పడనుందని ప్రకటించారు.
i love openai, and everything i’ve done over the past few days has been in service of keeping this team and its mission together. when i decided to join msft on sun evening, it was clear that was the best path for me and the team. with the new board and w satya’s support, i’m…
దీనికి ప్రతిస్పందనగా Altman X లో ఇలా రాసుకొచ్చాడు. నేను OpenAIని ప్రేమిస్తున్నాను. గత కొన్ని రోజులుగా నేను చేసిన ప్రతిదీ ఈ బృందాన్ని, వారితో కలిసి పనిచేసే సేవలో భాగంగానే జరిగిందన్నారు. ఆదివారం సాయంత్రం నేను మైక్రోసాఫ్ట్‌లో చేరాలని నిర్ణయించుకున్నప్పుడు, నాకు, బృందానికి అదే ఉత్తమ మార్గమని అనిపించిందని అన్నారు. కొత్త బోర్డ్, సత్య(satya nadella) మద్దతుతో, నేను OpenAIకి తిరిగి రావడానికి, Microsoftతో మా బలమైన భాగస్వామ్యాన్ని పెంచుకోవడానికి ఎదురు చూస్తున్నానని వెల్లడించారు.
We have reached an agreement in principle for Sam Altman to return to OpenAI as CEO with a new initial board of Bret Taylor (Chair), Larry Summers, and Adam D’Angelo.
We are collaborating to figure out the details. Thank you so much for your patience through this.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఎంత వేగంగా అభివృద్ధి చేయాలి. డబ్బు ఆర్జించాలి అనే దానిపై భిన్నాభిప్రాయాల నేపథ్యంలో శుక్రవారం ఓపెన్ఏఐ బోర్డుచే ఆల్ట్మాన్ తొలగించబడ్డారు. ఆ తర్వాత అతను తిరిగి రావడానికి కంపెనీతో చర్చలు జరిపారు. ఇప్పటికే ఉన్న బోర్డు సభ్యులు రాజీనామా చేయాలని ఆల్ట్‌మన్ ఇతరుల ఒత్తిడి కారణంగా ఆ చర్చలు ఆదివారం ప్రతిష్టంభనకు చేరుకున్నాయి. బదులుగా బోర్డు కొత్త లీడర్‌గా మాజీ ట్విచ్ CEO ఎమ్మెట్ షియర్ ను నియమించుకుంటామని కూడా ప్రతిపాదించారు. కానీ ఈ క్రమంలో మళ్లీ అతన్ని ఒప్పించినట్లు తెలుస్తోంది.
We are encouraged by the changes to the OpenAI board. We believe this is a first essential step on a path to more stable, well-informed, and effective governance. Sam, Greg, and I have talked and agreed they have a key role to play along with the OAI leadership team in ensuring… https://t.co/djO6Fuz6t9