ChatGPT App: ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కొత్త చాట్‌జీపీటీ యాప్ లాంచ్.!
ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ ఆండ్రాయిడ్ వెర్షన్ అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు కేవలం ఐఓఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఈ టెక్నాలజీ ఇప్పుడు అందరికి అందుబాటులోకి రాబోతుంది.
ChatGPT App: ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ చేస్తున్న అద్భుతాలు చూస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ టెక్నాలజీ మరింత చేరువకానుంది. అంటే ఆండ్రాయిడ్ వెర్షన్లో అందుబాటులో రానుంది. ఓపెన్ ఏఐ (OpenAI) ఆధారిత చాట్‌జీపీటీ (ChatGPT) ఆండ్రాయిడ్ వెర్షన్‌తో మరో అడుగు వేసినట్లే. ముందు ఐఓఎస్(iOS) యూజర్ల కోసం ChatGPT యాప్‌ను లాంచ్ చేసిన తర్వాత OpenAI యాప్ Android వెర్షన్‌ను లాంచ్ చేసేందుకు ఇప్పుడు రెడీగా ఉంది. ఈ యాప్ ఇప్పటికే ప్లే స్టోర్‌లో (Google Play Store) అందుబాటులో ఉంది. అయితే వచ్చే వారమే చాట్‌జీపిటీ(ChatGPT) యాప్ లాంచ్ కానుందని కంపెనీ తెలిపింది. ఈ మేరకు ముందస్తుగా ప్లే స్టోర్‌లో ఆర్డర్ చేయచ్చని పేర్కొంది. అయితే ఈ యాప్ ఎప్పుడు లాంచ్ చేస్తారనేది కచ్చితమైన తేదీ అయితే చెప్పలేదు. మేలో iOS యూజర్లకు ChatGPT లాంచ్ అయినప్పటి నుంచి చాలా మంది Android వెర్షన్ యాప్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
చాట్‌జీపీటీ గురించి ఈ పాటికే అందరికి తెలుసు. మనం అడిగిన ఏ ప్రశ్నకు అయిన సమాధానం చెబుతుంది. సాంగ్ రాయమాన్నా, సినిమా కథ రాయమన్నా ఇలా ఏది అడిగినా ఇట్టే చేసిపెడుతుంది. ఇలా చాట్‌బాట్ రాకతో ప్రపంచంలో తీవ్రపోటీ నెలకొంది.ఇది రావడంతో గూగుల్ బార్డ్ (Google Bard AI) చాట్‌బాట్ కంపెనీలు ఆందోళన పడుతున్నాయి. ఎందుకంటే చాట్‌జీపీటీ (ChatGPT) మాదిరి బార్డ్‌లో ప్రత్యేక మొబైల్ యాప్‌లు లేవు. కేవలం వెబ్ ఆధారంగానే ఉన్నాయి. చాట్‌జీపీటీ(ChatGPT) ఆండ్రాయిడ్ వెర్షన్ మాదిరిగానే మైక్రోసాఫ్ట్ కంపెనీ రూపొందించిన Microsoft Bing కూడా అందుబాటులో ఉంది. ఈ ఓపెన్ ఏఐ(OpenAI) వేగంగా సమస్యలను పరిష్కరిస్తుంది. ఈ యాప్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి మరిన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఆండ్రాయిడ్ యూజర్లు రాబోయే చాట్‌జీపీటీ (ChatGPT) యాప్‌తో ఆసక్తికరమైన సంభాషణలు, మీ ప్రశ్నలకు సమాధానాలను పొందవచ్చు.