»Spam Calls Can Be Checked With A New Feature In True Caller
Spam calls: స్పామ్ కాల్స్‌కు చెక్ ట్రూకాలర్‌లో కొత్త ఫీచర్
మోసపూరితమైన స్పామ్ కాల్స్ కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ ఓ అద్భుతమైన అవిష్కరణకు శ్రీకారం చుట్టింది. ఏఐ టెక్నాలజీ సాయంతో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది.
Spam calls can be checked with a new feature in True Caller
Spam calls: ప్రజలందరికీ నిత్యవసర వస్తువుగా మొబైల్(Mobile) మారింది. ఈ పరికరం లేనిదే చిన్నపిల్లోడు ముద్ద తినడం లేదు. పెద్దవాళ్లకు నిద్ర రావడం లేదు. ప్రస్తుతం ఫోన్ లేకుండా క్షణం గడిచే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిని మార్కెట్లో చాలా కంపెనీలు తమ ప్రొడక్ట్‌ను మార్కెట్ చేసుకుంటున్నాయి. కొన్ని మేసేజ్(Messages)లు పంపిస్తే మరికొన్ని డైరెక్ట్‌గా కాల్స్(Calls) చేస్తున్నాయి. తమ ఉత్పత్తుల గురించి నేరుగా కష్టమర్లకు వివరిస్తున్నారు. ఇవి ఒక రకమైతే ఇంకొన్ని కాల్స్ కస్టమర్లను రిస్క్‌లో పడేస్తాయి. ఇలాంటి కాల్స్లతో చాలా మంది విసిగిపోయారు. ముఖ్యమైన పనిలో బిజీగా ఉన్నపుడు ఇలాంటి కాల్స్ రావడం చాలామందికి విసుగు తెప్పిస్తోంది కూడా.
వీటికి తోడు మోసపూరితమైన కాల్స్ వల్ల చాలా మంది ఇప్పటికే డబ్బు పోగొట్టుకుంటున్నారు. అయితే వీటి నుంచి బయటపడేందుకు కష్టమర్లు కొన్ని థార్డ్ పార్టీ యాప్‌లను వాడుతున్నా పెద్దగా ఉపయోగం లేదు. ఇక టెలికం రంగంలో ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు చాలా ప్రయత్నాలు జరగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ట్రూ కాలర్ ఓ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకీ తీసుకొస్తోంది. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ అద్భుతాలు సృష్టిస్తున్న వేలా స్పామ్ కాల్స్ ను అడ్డుకునేందుకు ఏఐ సాయం తీసుకుంటోంది. అయితే, ఈ ఫీచర్ కోసం నెలనెలా కొంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని ట్రూ కాలర్ స్పష్టం చేసింది.
కస్టమర్ల భద్రత, వ్యక్తిగత వివరాల గోప్యతను ఈ ఫీచర్ కాపాడుతుందని వివరించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ ను ఆండ్రాయిడ్(Android) వినియోగదారులకు అందుబాటులో ఉంచినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. మొదటి 14 రోజులు ఈ ఫీచర్ ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఆ తరువాత యూజర్లు దీన్ని ప్రీమియం సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలని, ఇందుకోసం మొదటి నెల రూ.99 ఆపై నెల నెలా రూ.149 లు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ముఖ్యంగా వీటితో స్పామ్ కాల్స్‌ను గుర్తు పట్టడమే కాకుండా ఆ కాల్స్ సంబంధిత వివరాలను చూపెడుతుంది. దాని మూలంగా కాల్ ప్రధాన్యత తదితర విషయాలు ముందే తెలుసుకోవచ్చు. దీని వలన యూజర్లకు టైమ్ సేవ్ అవుతుందని తెలిపింది.