విజవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో భారీ చోరి జరిగింది. డబ్బున్న బ్యాగ్‌ను బస్సులో పెట్టి టిఫిన్ చేసి వచ్చే సరికి బ్యాగ్ మాయం అయింది. అందులో రూ.28 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బాధితుడు నార్కెట్‌పల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
Massive Theft: ప్రయాణికులు వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చినప్పుడు బస్సు సురక్షితం(bus is safe) అని భావిస్తుంటారు. కానీ మార్గ మధ్యలో టిఫిన్స్ కోసం ఆపే సౌకర్యం ఉండడంతో సాధారణ ఫ్యామిలీల నుంచి మధ్యతరగతి కుటుంబాలు కూడా ఈ ట్రావెల్ బస్సులపైనే నమ్మకంగా ఉంటారు. ఇలాగే బస్సు ఎక్కిన ఓ వ్యక్తి అక్షరాల రూ. 28 లక్షల రూపాయాలను పోగొట్టుకున్నారు. ఈ ఘటన తెలిసిన ప్రయాణికులు షాక్ అయ్యారు. విజవాడ నుంచి హైదరాబాద్( Vijayawada to Hyderabad) కు వెళ్తున్న ఓ బస్సులో భారీ చోరీ జరిగింది(massive theft). నార్కట్‌పల్లిలో బస్సు ఆగడంతో ఓ ప్రయాణికుడు టిఫిన్ కోసం బస్సు దిగి వెళ్లాడు. డబ్బులున్న బ్యాగ్ బస్సులోనే వదిలేసి వెళ్లడం కనిపెట్టిన దుండగులు దాన్ని కాజేశారు. తిరిగొచ్చిన ప్రయాణికుడు తన బ్యాగ్ కనిపంచకపోవడంతో లబోదిబోమని మోత్తుకున్నాడు. నార్కట్‌పల్లి పోలీసుస్టేషన్(Narkatpally Police Station) లో సదరు బాధితుడు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేబట్టారు.
పోలీసుల కథనం ప్రకారం విజవాడ నుంచి ఓ వ్యక్తి పెద్ద మొత్తంలో రూ.28 లక్షలతో హైదరాబాద్ కు వస్తున్నారు. ప్రముఖ ట్రావెల్స్ బస్సులో రిజర్వుడు సీటులో ప్రయాణిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్న బస్సులు మార్గ మధ్యలో టీ, టిఫిన్స్, టాయిలెట్స్ కోసం ఆపుతుంటారు. అలా నార్కెట్‌పల్లిలో బస్సు ఆగడంతో బధితుడు టిఫిన్ కోసం దిగారు. బ్యాగులో డబ్బులను గమనించిన దుండగుడు వాటితో పరారయ్యాడు. బస్సు ప్రయాణులను క్రాస్ చెక్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.