»Falaknuma Adaa Restaurant Third Place In World Best Thousand
ADAA: ప్రపంచంలో అత్యుత్తమ రెస్టారెంట్ల జాబితా: ‘ఆదా’కు థర్డ్ ప్లేస్
ప్రపంచంలో అత్యుత్తమ రెస్టారెంట్ల జాబితాను ఫ్రాన్స్‌కు చెందిన రెస్టారెంట్ గైడ్ అండ్ ర్యాంకింగ్ కంపెనీ లా లిస్టే విడుదల చేసింది. ఫలక్ నుమాకు చెందిన ఆదా రెస్టారెంట్ మూడో స్థానం దక్కించుకుంది.
Falaknuma ADAA Restaurant Third Place In World Best Thousand
ADAA: ప్రపంచంలో అత్యుత్తమ రెస్టారెంట్ల జాబితాను ఫ్రాన్స్‌కు (France) చెందిన రెస్టారెంట్ గైడ్ అండ్ ర్యాంకింగ్ కంపెనీ లా లిస్టే విడుదల చేసింది. 1000 రెస్టారెంట్లలో ఫుడ్, క్లీన్, సర్వీస్ ఇతర అంశాలను పరిశీలించి మరి రేటింగ్ ఇచ్చింది. ఇందులో దేశానికి చెందిన పలు హోటళ్లు ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఆదా (ADAA) రెస్టారెంట్ మూడో స్థానంలో నిలిచింది.
ఫస్ట్ ప్లేస్ కూడా మన దేశానికి దక్కింది. ఢిల్లీలో గల ఇండియన్ యాక్సెంట్ రెస్టారెంట్ మొదటిస్థానంలో నిలిచింది. హోటల్‌కు లా లిస్టే 95 పాయింట్లు ఇచ్చింది. బెంగళూరులో గల కరావల్లి 86 పాయింట్లతో రెండో స్థానం.. ఫలక్ నుమా ప్యాలెస్‌లో గల ఆదా 84 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాయి. ఇందులో హైదరాబాద్ వంటకాలు శుచిగా రుచిగా ఉంటాయి. అమెరికాకు చెందిన లే బెర్నార్డిన్ రెస్టారెంట్.. సహా ఏడు హోటళ్లు మొదటి స్థానంలో ఉన్నాయి. అందులో భారత్‌కు చెందిన ఇండియన్ యాక్సెంట్ హోటల్ కూడా ఒక్కటి.
ముంబైలో ఉన్న యౌచా, జియా, ఢిల్లీలో గల దమ్ ఫుఖ్త్, మేగు, బుఖరా, (ఐటీసీ మౌర్య) బెంగళూరులో గల జమావర్, లే సర్క్యూ సిగ్నేచర్ హోటళ్లు ఉన్నాయి. జాబితాలో దేశానికి చెందిన ఈ రెస్టారెంట్లు చోటు దక్కించుకున్నాయి.