తాను గాయపడినట్లు సమంత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇందులో తన చేతులకు గాయాలైనట్లుగా ఉన్నాయి. సమంత త్వరగా కోలుకోవాలని అభిమానులు దేవుడ్ని కోరుకుంటున్నారు. సమంత ఇప్పటికే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు.
హీరోయిన్ సమంతకు (Samantha Ruth Prabhu) గాయాలయ్యాయి. గత ఏడాది యశోద సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఈ గ్లామర్ డాళ్ ఓ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. గత కొద్ది రోజులుగా ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తున్నారు. సాధారణంగా పెద్ద హీరోయిన్లు గ్లామర్ రోల్స్ కు ఎక్కువగా పరిమితం అవుతారు. కానీ సమంత అందుకు భిన్నం. కొద్ది రోజులుగా భిన్నమైన కథలను ఎంచుకుంటున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో ఓటీటీలోకి వచ్చారు. రాజీ అనే క్యారెక్టర్ లో ఫైట్స్ తో అలరించారు. ఈ ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ తీస్తున్న సిటాడెల్ రీమేక్ లో నటిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రీకరణ సమయంలో ఆమె గాయపడినట్లుగా తెలుస్తోంది. తాను గాయపడినట్లు సమంత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇందులో తన చేతులకు గాయాలైనట్లుగా ఉన్నాయి. సమంత త్వరగా కోలుకోవాలని అభిమానులు దేవుడ్ని కోరుకుంటున్నారు. సమంత ఇప్పటికే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు.
ఈ వ్యాధి కారణంగా నడవడం, నిల్చోవడం, కూడా ఆమెకు కష్టంగా మారుతోంది. దీంతో షూటింగ్ సమయంలోను చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వాటిని మెల్లిమెల్లిగా అధిగమిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆమెకు గాయాలయ్యాయి. ఇదిలా ఉండగా, సమంత లీడ్ రోల్ లో నటించిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14వ తేదీన విడుదల కానుంది. విజయ దేవరకొండతో ఖుషీలో నటిస్తున్నారు. సిటాడెల్ లోను నటిస్తున్నారు.