RGV : బాలుడిపై కుక్క దాడి… మేయర్ విజయలక్ష్మీపై మరోసారి వర్మ సెటైర్లు..!
RGV : ఇటీవల ఓ నాలుగేళ్ల చిన్నారి పై వీధి కుక్కలు దాడి చేయగా... ఆ దాడిలో చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది.
ఇటీవల ఓ నాలుగేళ్ల చిన్నారి పై వీధి కుక్కలు దాడి చేయగా… ఆ దాడిలో చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన నేపథ్యంలో చాలా మంది తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయగా… ఆర్జీవీ మాత్రం మేయర్ విజయలక్ష్మీపై మండిపడ్డారు. ఆమె తన కుక్కను బిడ్డ పెంచినట్లుగా పెంచుతుంటారు. ఈ నేపథ్యంలో ఆయన ఆమె పై విమర్శలు చేశారు. మేయర్ ఇంట్లో 5 వేల కుక్కలను వదిలి పెట్టాలని ఆయన ఇప్పటికే ఆమె మీద విరుచుకుపడ్డారు.
తాజాగా ఆయన మరోసారి ట్విట్టర్ వేదికగా స్పందించారు. అధికారిక హోదాలో మీరు ఏం చేయలేకపోతే.. కనీసం వ్యక్తిగత హోదాలోనైనా అంబర్‌పేట బాలుడి కుటుంబానికి సాయం చేయాలని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గ్రేటర్ హైదరాబాద్ మేయర్గద్వాల విజయలక్ష్మిని కోరారు.
డాగ్లవర్ అయితే సరిపోదని.. తోటి మనుషులను కూడా ప్రేమించాలని మేయర్‌ను ట్యాగ్చేస్తూ వర్మ మంగళవారం ఉదయం వరుస ట్వీట్లు చేశారు. బాలుడు ప్రదీప్కుటుంబానికి తోటి పౌరులమైన మనం కూడా చేయూతనివ్వాలని, దయ కలిగిన వారు ఎవరైనా ఉంటే ప్రదీప్ తల్లిదండ్రుల జాయింట్అకౌంట్కు డబ్బు పంపి సాయం చేయాలని నగర ప్రజలను కోరారు. కాగా ఇప్పటి వరకు సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తోందని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.