»Rgv Rgv Who Made That Girl Worse How Good It Was Before
RGV: ఆ అమ్మాయిని దారుణంగా మార్చేసిన ఆర్జీవీ
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంట్లో పడ్డ ఏ హీరోయిన్ అయినా సరే.. ఆయనకు తగ్గట్టుగా మారిపోవాల్సిందే. ప్రస్తుత పరిస్థితుల్లో వర్మ బ్యాచ్‌లో ఉండే అమ్మాయిలు చేసే రచ్చ మామూలుగా ఉండదు. లేటెస్ట్గా ఓ హీరోయిన్ను పూర్తిగా మార్చేశాడు వర్మ.
RGV: సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా బండి లాగిస్తున్నాడు వివదాల రామ్ గోపాల్ వర్మ. అలాగే అప్పుడప్పుడు చిత్ర విచిత్రంగా చిందులేస్తు ఎంటర్టైన్ చేస్తుంటాడు. వొడ్కా విత్ రామ్ అంటూ చేసే ఇంటర్య్వూలు మామూలుగా ఉండవు. అయితే వర్మ ఎంత కాంట్రవర్శీ చేసినా.. హీరోయిన్ల విషయంలో అతని టేస్టే వేరు. ఇప్పటి వరకు వర్మ ఎంతోమంది ముద్దుగుమ్మలను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని.. ఇన్‌స్టాలో ఎవ్వరైనా అమ్మాయి నచ్చితే చాలు.. ఎవరా పిల్లా? ఏం చేస్తుంది? సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉందా? అని ఆరా తీస్తున్నాడు.
ఇటీవలె ఓ మళయాళి బ్యూటీ వర్మ కళ్లలో పడడమే లేట్.. వెంటనే సోషల్ మీడియా ద్వారా ఆమెని పట్టేశాడు. చీరలు కట్టుకొని నిండుగా కనిపించే ఆ అమ్మాయి ‘శ్రీలక్ష్మి సతీష్’. ఆమె ఒక ఇన్‌స్టా మోడల్, కేరళకి చెందిన అమ్మాయి. ఆమె అందానికి ఫిదా అయిన వర్మ.. వెంటనే ‘శారీ’ అనే సినిమా ప్రకటించాడు. ఆమె పేరు కూడా ఆరాధ్య దేవిగా మార్చేశాడు. అయితే.. అప్పట్లో ఆమె శారీ కట్టుకున్న ఫోటోలను షేర్ చేసిన వర్మ.. ఇప్పుడు ఆమె లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక ఈ ఫోటోలు చూసిన తర్వాత.. పాపం అంతకు ముందు ఎలా ఉండేది.. వర్మ దగ్గరికి వచ్చాక ఎలా మారింది.. అని అనిపించక మానదు.
ఎప్పుడు నిండుగా శారీలో కనిపించే ఆ అమ్మాయి.. వర్మ షేర్ చేసిన ఫోటోలో చాలా హాట్‌గా దర్శనమిచ్చింది. ఈ ఫోటోలు కేరళకు చెందిన ఆరాధ్యా దేవి అనే అమ్మాయివి.. చాలా అద్భుతంగా ఉన్నాయి కదూ.. అంటూ షేర్ చేశాడు. ఈ ఫొటోల్లో ఆరాధ్య కిల్లింగ్ లుక్‌తో కనిపించింది. బ్లాక్ కలర్ టాప్, జీన్స్ షార్ట్‌తో వైట్ టాప్‌లో ఎద అందాలను ఆరబోస్తూ కనిపిస్తోంది. దీంతో.. చీరలో ఎంత బాగుండేదో.. కానీ అమ్మడిని వర్మ పూర్తిగా మార్చేశాడని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.