»Hyderabad Couple Catch In Drunk And Drive Banjarahills
Drunk and Drive ఏయ్ నేనెవరో తెలుసా? పోలీసులపై రెచ్చిపోయిన తాగుబోతు
హైకోర్టులో న్యాయవాదినని రెచ్చిపోయాడు. తనకు నెలకు రూ.75 వేలు సంపాదిస్తానని చెప్పాడు. మీరు సంపాదిస్తారా అంతా? అని ప్రశ్నించాడు. మీరు అంత సంపాదిస్తున్నారా? మీకు అంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది?’ అంటూ అడిగాడు.
తాగి వాహనాలు నడపొద్దంటే వినడం లేదు. ముఖ్యంగా యువత మద్యంమత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ఉద్దేశంతోనే ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and Drive)పై నిషేధం విధించింది. ఈ సందర్భంగా రాత్రిళ్లు తాగి నడిపే వారిని విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ (Hyderabad)లోని బంజారాహిల్స్ లో తనిఖీలు చేపట్టగా ఓ జంట (Couple) పట్టుబడింది. తాగి కారు నడుపుతున్న యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆ యువకుడు నానా రచ్చ చేశాడు. తాను న్యాయవాదినని.. కోర్టులో తేల్చుకుందామంటూ పోలీసులపై రెచ్చిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ (Banjara Hills)లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఓ కారును ఆపగా ఓ యువకుడు మద్యంమత్తులో మునిగి తేలుతున్నాడు. ఆ పక్కనే యువతి కూడా ఉంది. వారిని ఆపి బ్రీత్ ఎనలైజర్ (Breath Analyzer) తనిఖీ చేయగా 94 పాయింట్లు వచ్చింది. కారు దిగాలని అతడిని కోరగా రెచ్చిపోయాడు. తన పేరు గౌరవ్ అని, హైకోర్టులో న్యాయవాదినని రెచ్చిపోయాడు. తనకు నెలకు రూ.75 వేలు సంపాదిస్తానని చెప్పాడు. మీరు సంపాదిస్తారా అంతా? అని ప్రశ్నించాడు. మీరు అంత సంపాదిస్తున్నారా? మీకు అంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది?’ అంటూ అడిగాడు. మరింత రెచ్చిపోయి పోలీసులనే మీకు సెక్షన్లు తెలుసా? అంటూ నిలదీశాడు. ఈ సందర్భంగా పోలీసులపై అసభ్య పదాలతో దూషించాడు. పక్కనున్న అమ్మాయి కూడా రెచ్చిపోయింది. వీరిద్దరూ మద్యం తాగారని పోలీసులు నిర్ధారించారు. తనకు న్యాయమూర్తులు, న్యాయవాదులు తెలుసంటూ రెచ్చిపోయాడు. ఎవరు తెలిస్తే ఏంటి ముందు కారు దిగు అంటే నానా రభస చేశాడు. ఎస్సైపై దాడికి యత్నించాడు. కాలితో తన్నే ప్రయత్నం చేశాడు. నాపై కేసు ఎలా నమోదు చేస్తాడని తూలుతూ నిలదీశాడు.
అర్ధరాత్రి వీరు నానా హంగామా చేశారు. అనంతరం వాళ్లిద్దరి అదుపులోకి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కారును స్వాధీనం చేసుకున్నారు. వివరాలు సేకరించగా ఆ యువకుడు ప్రముఖ ఓటీటీ సంస్థలో పని చేస్తున్నాడని సమాచారం. మద్యం తాగి వాహనం నడపడంతో పాటు విధుల్లో ఉన్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన వాటి కింద కేసులు నమోదు చేశారు. నిందితుడి కుటుంబసభ్యులను పిలిపించి మాట్లాడుతున్నట్టు సమాచారం. కాగా అతడికి డ్రంక్ అండ్ డ్రైవ్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అవగాహన కల్పించే వీడియోలు చూపించారు. ఇటీవల ఏపీలోని విశాఖపట్టణంలో ఇలాంటి సంఘటనే జరిగింది. 52 మంది మద్యం తాగి వాహనాలు నడిపితే కోర్టు వారికి ఆర్కే బీచ్ శుభ్రం చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. యువత సన్మార్గంలోకి రావాలనే ఉద్దేశంతో కోర్టు ఆ తీర్పునిచ్చింది.