»Bandi Sanjay Said Bjp Competition In 119 Constituencies In Telangana Huge Meeting Also
Bandi Sanjay: తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో భారీ సభలు..పోటీ కూడా చేస్తాం
తెలంగాణాలో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో భారీ సభలు ఏర్పాటు చేయడంతోపాటు అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.
తెలంగాణ(telangana)లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ(BJP) స్పీడు పెంచినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తే ఎలా ఎదుర్కొవాలనే దానిపై కూడా బీజేపీ నేతలు చర్చించినట్లు తెలిసింది. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(jp nadda), కేంద్ర హోంమంత్రి అమిత్ షా(amit shah)తో తెలంగాణ బీజేపీ నేతలు దాదాపు 4 గంటలపాటు ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల సన్నద్ధత కోసం వ్యూహాన్ని రూపొందించినట్లు తెలిసింది.
ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay), బీజేపీ జాతీయ సంస్థ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్(bl santhosh), బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ అరవింద్(mp aravind), సుధాకర్ రెడ్డి-టీఎన్ కో-ఇంఛార్జి, కే లక్ష్మణ్, జీ కిషన్ రెడ్డి, విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, జి మోహన్ రావు, మురళీధర్ రావు సహా తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. “ప్రజా గోస బీజేపీ భరోసా”, “ప్రజా సంగ్రామ యాత్ర” వంటి కార్యక్రమాలపై నడ్డా(jp nadda) ఆరా తీసినట్లు తెలిసింది. పార్టీ ప్రజలతో మమేకం కావడానికి, అట్టడుగు స్థాయికి చేరుకోవడానికి “ప్రజా గోస బీజేపీ భరోసా” వంటి కార్యక్రమాలకు ప్రజల నుంచి సానుకూల స్పందనలు వచ్చినట్లు పలువురు చెబుతున్నారు. మరోవైపు బూత్ స్థాయిలో పార్టీని ఎలా బలోపేతం చేయాలనే దానిపై పార్టీ చర్చించినట్లు తెలుస్తోంది.
మరోవైపు బీజేపీ అధ్యక్షుడు సంజయ్(Bandi Sanjay)పదవీకాలం మార్చి మొదటి వారంలో ముగియనుంది. ఈ క్రమంలో త్వరలో రాష్ట్ర బీజేపీ(bjp) అధ్యక్ష ఎన్నికలు(president elections) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిగా అతని పదవీకాలం పొడిగించబడుతుందని పలువురు అంటుండగా…మరో వ్యక్తికి అవకాశం ఇస్తారని ఇంకొంత మంది చెబుతున్నారు. ఇప్పటికే అంతకుముందు జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో సంజయ్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా నిలిచారు. ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) సంజయ్ “ప్రజా సంగ్రామం యాత్ర” ను ప్రశంసించారు. అతని పోరాటం, కృషిని అభినందించారు.
మరోవైపు ఈ భేటీ తర్వాత బీజేపీ వచ్చే ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో(119 constituencies) పోటీ చేస్తుందని బండి సంజయ్(Bandi Sanjay) ప్రకటించారు. ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో భాగంగా పెద్ద, చిన్న బహిరంగ సభలు, ర్యాలీలు, బూత్ బలోపేతం కార్యక్రమం వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సమస్య ఏదైనా ముందు స్పందించేది బీజేపీనేనని బండి సంజయ్ స్పష్టం చేశారు.
ఇంకోవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో భారత రాష్ట్ర సమితి(BRS) నాయకురాలు, కేసీఆర్(kcr) కుమార్తె కె.కవిత(kavitha)కు సంబంధించిన అంశంపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని సంజయ్ ప్రశ్నించారు. లిక్కర్ కేసులో కవితకు సంబంధం ఉన్నట్లు సీబీఐ(cbi) ఛార్జీషీటులో పేర్కొన్నారని సంజయ్ వెల్లడించారు. ఈ కేసులో సిసోడియాను అరెస్టు చేస్తే బీజేపీకి ఏం సంబంధమని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. అవినీతికి పాల్పడిన వారు ఎవరైనా చట్టం దృష్టిలో సమానమేనని వెల్లడించారు.