»Governer Tamili Sai Reacts On Medico Preethi Died
governer on preethi:ఎంజీఎం నుంచి నిమ్స్‌కు తరలింపు, సమయం వేస్ట్: ప్రీతి మృతిపై గవర్నర్
governer on preethi died:మెడికో ప్రీతి (preethi) మృతిపై తెలంగాణ గవర్నర్ (governer) తమిళి సై సౌందరరాజన్ (tamili sai) స్పందించారు. ప్రీతి ఆరోగ్యం సరిగా లేదని తప్పుడు సమాచారం ఎందుకు ఇస్తున్నారని అడిగారు. నిందితుడిని కాపాడటానికి ప్రయత్నించిన కాకతీయ మెడికల్ యూనివర్సిటీ (kmcr) అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
governer on preethi:మెడికో ప్రీతి (preethi) మృతిపై తెలంగాణ గవర్నర్ (governer) తమిళి సై సౌందరరాజన్ (tamili sai) స్పందించారు. ప్రీతి ఆరోగ్యం సరిగా లేదని తప్పుడు సమాచారం ఎందుకు ఇస్తున్నారని అడిగారు. నిందితుడిని కాపాడటానికి ప్రయత్నించిన కాకతీయ మెడికల్ యూనివర్సిటీ (kmcr) అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వర్సిటీ వీసీకి (vc) గవర్నర్ లేఖ రాశారు. సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. మెడికల్ కాలేజీల్లో (medical college) యాంటి రాగింగ్ (anti ragging) చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళా మెడికోలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇలాంటి ఘటనలతో తక్షణం స్పందించి కాలేజీలలో కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రీతి మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
కాకతీయ మెడికల్ కాలేజీలో (kmc) మెడిసిన్ పీజీ చేస్తోన్న ప్రీతి మత్తుమందు తీసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. వెంటనే వరంగల్ ఎంజీఎం (mgm) ఆసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్‌కు (nims) తరలించారు. నిమ్స్ వైద్యులు తీవ్రంగా శ్రమించినా ప్రీతికి (preethi) జీవం పోయలేకపోయారు.
చదవండి:Medico Preethi: ప్రీతి కేసులో తెరపైకి మరో కొత్త కారణం
ప్రీతి (preethi) మృతి చాలా బాధాకరం అని తమిళి సై అన్నారు. మెడికల్ కాలేజీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. పీజీ మెడికోల డ్యూటీ సమయం (duty time), విశ్రాంతి (rest) వంటి అంశాలపై శ్రద్ధ వహించాలని సూచించారు. మహిళా మెడికోలకు (woman medico) కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. వరంగల్ ఎంజీఎం నుంచి నిమ్స్‌కు (nims) తరలించడంతో విలువైన సమయం కోల్పోయినట్టు అయిందని గవర్నర్ (governer) అభిప్రాయపడ్డారు. ప్రీతిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోనే ఉంచితే బాగుండేదని అన్నారు. హైదరాబాద్ (hyderabad) నుంచి నిపుణులైన వైద్యులను, వైద్య పరికరాలను అక్కడికే తరలించి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు.
విద్యాసంస్థల్లో ర్యాగింగ్, వేధింపులకు సంబంధించిన ఎస్ఓపీలపై పూర్తి వివరాలతో నివేదిక అందించాలని వర్సిటీని లేఖలో ఆదేశించారు. వైద్య కళాశాల్లో మెడికోలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పనిగంటల వివరాలతోపాటు మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, పనితీరు తదితర అంశాలపై నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు.