»Ys Jagan Challanges Chandrababu And Pawan Kalyan To Contest All Seats
YS Jagan: బాబు, పవన్‌కు జగన్ సరికొత్త సవాల్..! వైసీపీకి భయం పట్టుకుందా?
మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ (Telugu Desam) జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు (Nara Chandrababu Naidu), జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (Chief Minister of Andhra Pradesh) వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) సరికొత్త సవాల్ విసిరారు.
మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ (Telugu Desam) జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు (Nara Chandrababu Naidu), జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (Chief Minister of Andhra Pradesh) వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) సరికొత్త సవాల్ (challange) విసిరారు. వారిద్దరికి దమ్ముంటే 175కు 175 స్థానాల్లో పోటీ చేయాలన్నారు. తాము ప్రజలకు మంచి చేశాం కాబట్టి మళ్లీ అన్ని స్థానాల్లో గెలుస్తామని ధీమా తమకు ఉందని చెప్పారు. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లు గెలవడమే తమ లక్ష్యమన్నారు. మరి జనసేన, టీడీపీలకు (Telugu Desam, Janasena alliance) సొంతగా అన్ని స్థానాల్లో పోటీ చేసే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రజలకు మంచి చేయలేదు కాబట్టి అన్ని స్థానాల్లో పోటీ చేసే దమ్ము లేదన్నారు. నేను మంచి చేశాను కాబట్టే ధైర్యంగా చెబుతున్నానని వెల్లడించారు. వారిది గజదొంగల ముఠా అని, ఈ ముఠాకు దత్తపుత్రుడు జత కలిశాడని జనసేనానిని ఉద్దేశించి దుయ్యబట్టారు. జగన్ ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ములేకనే చంద్రబాబు, పవన్ లు కలిసి పని చేస్తున్నారని, కలిసినా కూడా వారి సత్తా సరిపోదని వివిధ సందర్భాల్లో మంత్రులు, వైసీపీ నాయకులు వ్యాఖ్యానించిన దాఖలాలు ఉన్నాయి. అదే సమయంలో జగన్ కూడా 175 చోట్ల తమదే గెలుపు అని పలుమార్లు చెప్పారు. కానీ, ఇప్పుడు నేరుగా వారిని వేర్వేరుగా పోటీ చేయాలని సవాల్ చేస్తున్నారు. తద్వారా వైసీపీకి లేదా జగన్ కు.. వారు కలిస్తే తమకు ఎసరు వస్తుందనే భయం పట్టుకుందా అనే చర్చ సాగుతోంది.
2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిశాయి. అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. వివిధ కారణాల వల్ల గత ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేయడంతో వైసీపీ ఏకంగా 151 స్థానాలను గెలుచుకుంది. జగన్ ను ఎదుర్కోవడానికి విపక్షాలు ఏకతాటి పైకి రావాలని పవన్ కళ్యాణ్ అప్పుడే నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. అందుకే, 2024 ఎన్నికల్లో విపక్ష ఓట్లను చీలనివ్వనని, బీజేపీ, టీడీపీతో కలిసి సాగుదామనే ఉద్దేశ్యంతో ఉన్నారు. కారణాలు ఏవైనా.. బీజేపీకి దూరం జరిగి, టీడీపీ – జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు కలిస్తే 2014 పునరావృతమవుతుందని వైసీపీ భావిస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ఏపీలో కాపు ఓట్లు చాలా కీలకం. పవన్, చంద్రబాబు వేర్వేరుగా పోటీ చేస్తే ఈసామాజిక వర్గాల ఓట్లు చీలడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా చీలుతుందని భావిస్తున్నారు. అది జగన్ కు ప్లస్ అవుతుంది. కానీ ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదు… అదే సమయంలో ఆయా వర్గాల మెజార్టీ ఓట్లు వీరికి పడతాయి. అదే జరిగితే టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇలాంటి సమయంలో స్వయంగా జగన్ నోటి నుండి వారిరువురు దమ్ముంటే వేర్వేరుగా పోటీ చేయాలనే అర్థం వచ్చేలా మాట్లాడటం ఆసక్తిని రేపుతోంది. ఇద్దరు కలిస్తే తమకు ఎసరు పడుతుందని జగన్ కూడా లెక్కలు వేసుకొని ఉంటారనే చర్చ సాగుతోంది. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంపై చాలాచోట్ల తీవ్ర అసంతృప్తి నెలకొంది. దాదాపు సగం మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమైన ప్రతిపక్షాలు ఏకమైతే ఇబ్బంది అవుతుంది. అందుకే టీడీపీ, జనసేనలు వేర్వేరుగా 175 స్థానాల్లో పోటీ చేయగలరా అనే సవాల్ విసరడం ప్రాధాన్యత సంతరించుకుంది.