తెనాలిలో (Tenali) నాలుగో సంవత్సరం వైయస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ (PM Kisan) నిధులను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి (Andhra Pradesh Chief Minister) వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) మంగళవారం విడుదల చేశారు. ఆయన తన తాడేపల్లి ప్యాలెస్ (tadepalli palace) నుండి తెనాలికి (Tenali) హెలికాప్టర్ పైన రావడం చాలామందిని విస్మయపరిచింది. దీనిపై జనసేన (Janasena) పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) స్పందించారు.
తెనాలిలో (Tenali) నాలుగో సంవత్సరం వైయస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ (PM Kisan) నిధులను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి (Andhra Pradesh Chief Minister) వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) మంగళవారం విడుదల చేశారు. ఆయన తన తాడేపల్లి ప్యాలెస్ (tadepalli palace) నుండి తెనాలికి (Tenali) హెలికాప్టర్ పైన రావడం చాలామందిని విస్మయపరిచింది. దీనిపై జనసేన (Janasena) పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) స్పందించారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి 28 కిలోమీటర్లున్న తెనాలికి హెలికాప్టర్లో వెళ్లిన జగన్.. అంటూ ట్విట్టర్ లోను సెటైరికల్ పోస్ట్ పెట్టింది జనసేన (janasena). ఆ కొద్ది దూరం కూడా హెలికాప్టర్ ద్వారా ప్రయాణించడాన్ని నాదెండ్ల తప్పుబట్టారు. రోడ్డు పైనుండి వెళ్తే గుంతలు.. పాడైపోయిన రోడ్లు ఉంటాయని హెలికాప్టర్ లో వెళ్తున్నారా? అని నిలదీశారు. ప్రజలను మాత్రం గతుకుల రోడ్ల పాలు చేసి జగన్ (YS Jagan) మాత్రం హాయిగా హెలికాప్టర్ లో తిరుగుతున్నారని మండిపడ్డారు.
తన ప్యాలెస్ నుంచి తెనాలికి 28 కిలో మీటర్ల దూరం మాత్రమే ఉందని, ఈ మాత్రం దూరం కూడా రోడ్డు ప్రయాణం చేయలేరా అని ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి తెనాలికి హెలికాప్టర్ లో వెళ్ళడం ఏమిటని జనాలు కూడా నవ్వుకుంటున్నారన్నారు. •జనం సొమ్ము జగన్ హెలికాప్టర్ పర్యటనల పాలవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తిరిగే ఈ హెలికాప్టర్ కు చేసే ఖర్చుకు బదులు డబ్బులతో రోడ్లు బాగా అవుతాయి కదా అని సూచించారు. జగన్ రోడ్డు మీద తిరగటం మరిచిపోయినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి జగన్ తెనాలి పర్యటన సందర్భంగా జనసేన పార్టీ నాయకులను అరెస్టు చేయడాన్ని నాదెండ్ల ఖండించారు. తమ కార్యకర్తలు, నాయకుల అరెస్ట్ అప్రజాస్వామికం అన్నారు. ముఖ్యమంత్రి వస్తే ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్ట్ చేయాలని ఏ చట్టం చెబుతోందో చెప్పాలన్నారు. అధికార పార్టీ నాయకులకు, అధికారులకు ఎందుకు అంత అభద్రతా భావమో తెలియడం లేదన్నారు. ఈ రోజు తెనాలి పట్టణంలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం సృష్టించారన్నారు. పార్టీల నాయకులను అరెస్ట్ చేయడం, ప్రజలను బయటకు రానీయకపోవడం, దుకాణాలు మూయించడం… చూస్తుంటే రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగిస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు.
తెనాలి ఎంతో ప్రశాంతమైన పట్టణమని, కళలు, సంస్కృతికి నెలవైన తెనాలిలో ప్రజలు ప్రశాంతత కోరుకుంటారన్నారు. అలాంటి పట్టణంలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో భయానక వాతావరణం సృష్టించడమే వైసీపీ మార్కు పాలనకు నిదర్శనం అన్నారు. ప్రజలన్నా, ప్రశ్నించే ప్రతిపక్షాలన్నా ముఖ్యమంత్రి జగన్ కు భయమన్నారు. అందుకే ప్యాలెస్ నుంచి బయటకు రాకుండా… ఒకవేళ వచ్చినా పరదాల చాటున తిరిగే వ్యక్తికి భయం కాక మరేం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి పర్యటన ముస్తాబుల కోసం తెనాలి ప్రభుత్వ హాస్పిటల్ కు విద్యుత్ సరఫరా నిలిపి రోగులను ఇబ్బందులపాలు చేశారన్నారు. కాగా, జగన్ తెనాలి పర్యటన సందర్భంగా జనసేన రాష్ట్ర కార్యదర్శి, గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు తదితరులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.
తాడేపల్లి ప్యాలెస్ నుంచి 28 కిలోమీటర్లున్న తెనాలికి హెలికాప్టర్లో వెళ్లిన జగన్!! pic.twitter.com/17FsbAjaqJ