ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ధరల తగ్గింపుపై దృష్టి సారిస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటూ కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి నిత్యావసర వస్తువులైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం తగ్గించాలని ప్రకటించారు.
గత నెల రోజుల్లో ధరలు తగ్గించడం ఇది రెండవ సారి… ‘నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను మరో దఫా తగ్గించాలని నిర్ణయించడమైనది. బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో రూ.160 నుంచి రూ.150కీ, బియ్యం రూ.48 నుంచి రూ.47కీ, స్టీమ్డ్ బియ్యం రూ.49 నుంచి రూ.48కీ తగ్గించడమైనది. తగ్గించిన ధరలతో రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి గురువారం నుంచి విక్రయిస్తారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్లకు ఆదేశించడమైనది. రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం- ఈ నెల రోజులలోపున బియ్యం, కంది పప్పు ధరలను రెండుసార్లు తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.’ అని మంత్రి X ఖాతాలో పోస్ట్ చేశారు.
ధరల తగ్గింపుపై సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం జనసేన, టీడీపీ సానుభూతిపరులే కాకుండా సామాన్య ప్రజలు కూడా హర్ష వ్యక్తం చేస్తున్నారు.adendla manohar