»Pawan Kalyans Fourth Marriage Is To Nadendla Manohar Ambati Rambabu
Ambati Rambabu: పవన్ కల్యాణ్‌కు నాలుగో పెళ్ళాం నాదెండ్ల మనోహర్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. పవన్ నాలుగో పెళ్ళాం ప్రస్థావనపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. నాదేండ్ల మనోహారే ఆయనకు ఫోర్త్ వైఫ్ అంటూ విమర్శించారు.
Pawan Kalyan's fourth marriage is to Nadendla Manohar... Ambati Rambabu
Ambati Rambabu: జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆ పార్టీ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌పై ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లాం ఎవరో అని అంటున్నాడు నాదెండ్ల మనోహర్ అని మా అందరికి ఎప్పుడో తెలుసు అని విమర్శించారు. జగన్‌ను పాతాళానికి తోక్కేస్తా అని అన్నాడు అది జరగాలంటే పవన్‌ను పుట్టించిన వాళ్లు దిగి రావాలని పేర్కొన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకుంటామా అని అన్నారు. జగన్ గోప్పో, పవన్ గొప్పో జనసైనికులకు కూడా తెలుసు అన్నారు. పవన్ మంచి నటుడు, ఆయన సినిమాలకు పనికొస్తాడు కానీ రాజకీయాలకు కాదు అన్నారు. ఏవో నాలుగు సినిమా డైలాగులు చెబితే జనం చప్పట్లు కొడుతారు అంతే అని అన్నారు.
పిచ్చిపిచ్చిగా మాట్లాడి చీప్‌గా ప్రవర్తిస్తున్నాడని మంత్రి పేర్కొన్నారు. ప్రజలను పవన్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, పవన్ నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్టే అని విమర్శించారు. చంద్రబాబును జైల్లో వేస్తే బాధేసింది అన్నాడు. వంగవీటి రంగను హత్య చేసినప్పుడు బాధ కలగలేదా? ముద్రగడను వేధించినప్పుడు బాధ కలగలేదా అని ప్రశ్నించారు. జనసేన, టీడీపీ కలిసి తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన జెండా బహిరంగ సభలో అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కల్యాణ్ ఇద్దరు తీవ్రస్థాయిలో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా మాట్లాడడం తప్పా జగన్ సబ్జెక్ మాట్లాడడం తెలియదు అంటూ.. ఎప్పుడు చూసినా మూడు పెళ్లిళ్లు, రెండు విడాకాలు అంటుంటాడు. ఈ మధ్య నాలుగో పెళ్లాం అంటున్నాడు లేని పెళ్లాం గురించి ఆయనకెలా తెలుసు.. లేదా నాలుగో పెళ్లంగా జగన్ నువ్వు రా అంటూ పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.