Nagababu apologized for his words during Operation Valentine's pre-release ceremony
Nagababu: జనసేన(Janasena) పార్టీ ప్రధాన కార్యదర్శి నటుడు, నిర్మాత నాగబాబు(Nagababu) ఎక్స్ వేదికగా సారీ చెప్పారు. ఆయన తనయుడు వరుణ్ తేజ్(Varuntej) నటించిన ఆపరేషన్ వాలెంటైన్(Operation valentine) చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. పోలీసులు క్యారెక్టర్ గురించి కొన్ని మాటలు అన్నారు. త్రివిధదళాలలో ఎయిర్ ఫోర్స్ అనేది అత్యంత రిస్క్‌తో కూడుకున్న జాబ్ అని చెబుతూ.. వరుణ్ చాలా అదృష్టవంతుడు ఆ ఎత్తు రావడం దేవుడి దయ అన్నారు. పోలీసుల క్యారెక్టర్, ఇలాంటి సైనికుడి క్యారెక్టర్ చేయాలంటే ఎత్తు మినిమమ్ ఉండాలి, వరుణ్ తేజ్ 6.3 అడుగులు ఉండడం మంచిది అన్నారు. అదే 5 అడుగుల 3 అంగులాల హైట్ ఉన్నవాళ్లు నేను స్ట్రిక్ట్ పోలీసులు ఆఫీసర్ అంటే అంతగా నమ్మాలనిపించదు అని, అదే హైట్ అండ్ పర్సనాలిటీ బాగుంటే నిజమే అనిపిస్తుంది అని వ్యాఖ్యానించారు.
నాగబాబు మాటలను కొంత మంది కావాలనే పలాన హీరోను ఉద్దేశించి మాట్లాడరని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. వీడియోలు, ఫోటోలు పెట్టి కావాలనే విద్వేశాలను రెచ్చగొట్టెలా ఎడిటింగ్లు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. టీడీపీ, జనసేన పొత్తుల రాజకీయం చేస్తుంది. ఈ నేపథ్యంలో నాగబాబు మాటలకు వీడియోలు మార్చి టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది. విషయాన్ని గ్రహించిన నాగబాబు తన మాటలు వెనక్కి తీసుకుంటున్నట్లు, అవి ఉద్దేశపూర్వకంగా అన్నవి కావు అని స్పషం చేశారు. తన మాటలకు ఎవరైనా నొచ్చుకొని ఉంటే క్షమించమని కోరారు. ప్రస్తుతం ఆయన చేసిన పోస్ట్ నెట్టింట్ల వైరల్ అవుతుంది. వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా నటించిన ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం మార్చి 1 ప్రేక్షకుల ముందుకు రానుంది.