Janasena President Pawankalyan speach at Thadepalligudem
PawanKalyan: ఈ ఐదేళ్లపాలనలో రైతులను, యువతను, మహిళలను అంగాన్వాడి టీచర్లను అందరినీ మోసం చేశారు. తాడేపల్లిగూడెంలో జెండా సభ భహిరంగ సమావేశానికి వచ్చిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. సముద్రం ఒకడి ముందు తలవంచదు, శిఖరం మొకరిల్లదు కానీ తలెత్తితే ఒక జెండాకు ఉన్నంత పొగరు ఉంటుంది అని అందుకే ఈ సభకు జెండా అని పేరు పెట్టినట్లు చెప్పారు. వైసీపీ పాలనలో క్లీన్ రోడ్స్ ఉన్నాయి, అందిరికీ ఉద్యోగాలు ఉన్నాయి, ఎవరికి హత్యలు, కత్తులు అంటే తెలియదని ఎద్దేవా చేశారు. నడిమత్రపు సిరి వచ్చిన ఎవరి వెనుకాలైనా క్రైమ్ ఉంటుందని పేర్కొన్నారు.
వైసీపీ నాయకులకు ఎవరు భయపడొద్దని ధైర్యం ఇచ్చారు. మీ కోసం రాజకీయ ఉద్దండుడైన నారా చంద్రబాబు నాయుడు, జనసేన పవన్ కల్యాణ్ ఉన్నాము అని అన్నారు. జనసేన కేవలం రాష్ట్రప్రయోజనాల కోసమే మాట్లాడుతాడు అని, అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లు తెలిపారు. తెలుగు దేశం, జనసేన కలిసి నడువాలని, మనలో మనం కలహించుకోవద్దని పిలుపునిచ్చారు. 2019లో ఆంధ్రప్రజలకు జగన్కు ఓటు వేయొద్దని మరీ మరీ చెప్పాను, కానీ ప్రజలు అతని మాయ మాటలు నమ్మి మోసపోయారు అని అన్నారు. ఎస్సీ, ఎస్టీలు అందరినీ మోసం చేసిన వ్యక్తి ఈ జగన్ అన్నారు.
చదవండి:BJP leader Laxman: పార్లమెంట్ ఎన్నికల తరువాత తెలంగాణలో ఏదైనా జరగొచ్చు