»Mp Magunta Srinivasulureddy Another Shock For Ycp Ongolu Mp Resigns
MP Magunta Srinivasulureddy: వైసీపీకి మరో షాక్.. ఒంగోలు ఎంపీ రాజీనామా!
వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే చాలామంది కీలకనేతలు పార్టీ నుంచి విడిపోయారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
MP Magunta Srinivasulureddy: వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే చాలామంది కీలకనేతలు పార్టీ నుంచి విడిపోయారు. మరో కీలకనేత కూడా పార్టీ నుంచి విడిపోతున్నట్లు తెలిపారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఒంగోలులో నిర్వహించిన సమావేశంలో తెలిపారు. ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే ఒక బ్రాండ్. 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న.. 11 సార్లు చట్టసభలకు పోటీ చేశారు. మాగుంట కుటుంబానికి కేవలం ఆత్మగౌరవమే ఉంది. అసలు అహంకారం లేదు.
కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీని వీడాల్సి వస్తుందని తెలిపారు. వీడిపోవడం బాధాకరమే అయినా తప్పడం లేదన్నారు. ఒంగోలు ఎంపీ బరిలో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని నిలపాలని నిర్ణయించామని శ్రీనివాసులు తెలిపారు. మాగుంట రాజీనామాతో కొద్దిరోజుల్లోనే ఆరుగురు ఎంపీలు వైసీపీని వీడారు. వీరిలో ఐదుగురు లోక్‌సభ సభ్యులు, ఒక రాజ్యసభ ఎంపీ ఉన్నారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, సంజీవ్‌కుమార్ (కర్నూలు), లావు శ్రీకృష్ణదేవరాయలు (నరసరావుపేట), రఘురామకృష్ణరాజు (నర్సాపురం)తో పాటు రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు.