ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిన్నటితో ముగిసింది. పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన తరపున పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోటీచేశారు. పవన్‌కి మద్దతుగా రాకుండా స్నేహితుడికి మద్దతుగా అల్లు అర్జున్ వెళ్లాడు. అయితే బన్ని పేరు ఎత్తకుండా నాగబాబు ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
Nagababu: Did you mean Banni?.. Nagababu's tweet is going viral!
Nagababu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిన్నటితో ముగిసింది. అయితే పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన తరపున పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోటీచేశారు. పవన్‌కి మద్దతుగా రామ్ చరణ్ ప్రచారానికి వెళ్లారు. చంద్రబాబు ఓ వీడియో చేసి షేర్ చేశారు. అల్లు అర్జున్ ఒక ట్వీట్ చేసి సరిపెట్టారు. కానీ తన స్నేహితుడైన అభ్యర్థి కోసం అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లారు. తన స్నేహితుడిని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో జనసైనికులతో మరికొందరు అల్లుఅర్జున్‌పై విమర్శలు చేశారు. కానీ అల్లుఅర్జున్ మాత్రం స్నేహితుడికి మాట ఇచ్చాను. అందుకే సపోర్ట్‌కి వెళ్లానని చెప్పాడు.
ఇదిలా ఉండగా ఎన్నికలు పూర్తికాగానే నాగబాబు ఓ ట్వీట్ చేశారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడు అయిన పరాయి వాడే.. మాతో నిలబడే వాడు పరాయివాడైన మావాడే అని నాగబాబు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. అల్లుఅర్జున్ పేరు పెట్టకుండా తనని ఉద్దేశించే ఈ ట్వీట్ చేశారా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి నాగబాబు ఈ ట్విట్ ఎవర్ని ఉద్దేశించి చేశారో స్పందిస్తేనే తెలుస్తుంది.