సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు వారణాసి నుంచి నామినేషన్ వేయనున్నారు. అయితే ఈ ప్రాంతంతో తనకు ముడిపడి ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఓ వీడియోను మోదీ షేర్ చేశారు.
PM Modi: సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు వారణాసి నుంచి నామినేషన్ వేయనున్నారు. అయితే ఈ ప్రాంతంతో తనకు ముడిపడి ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఓ వీడియోను మోదీ షేర్ చేశారు. కాశీ నగరంపై తనకున్న ప్రేమ, గంగానదితో ఏర్పడిన బంధం కాలక్రమంలో దృఢమవుతూ వచ్చిందని తెలిపారు. ఈ ప్రాంతంలో నిర్వహించిన రోడ్‌షోలు, ఆధ్యాత్మిక పర్యటనలు ఇప్పటికీ గుర్తున్నాయి. 2014లో కాశీకి వచ్చినప్పుడు గంగమ్మ నన్ను ఈ నగరానికి ఆహ్వానించినట్లు అనిపించిందని మోదీ అన్నారు.
अपनी काशी से मेरा रिश्ता अद्भुत है, अभिन्न है और अप्रतिम है… बस यही कह सकता हूं कि इसे शब्दों में व्यक्त नहीं किया जा सकता! pic.twitter.com/yciriVnWV9
ఈ పదేళ్ల కాలం తర్వాత ఆ గంగమ్మ నన్ను దత్తత తీసుకుందని చెప్పగలను. ఇన్నేళ్లలో కాశీతో నా బంధం దృఢంగా మారింది. అయితే ఇప్పుడు ఆ ప్రాంతం నాది. ఒక తల్లి, కుమారుడికి ఉన్న సాన్నిహిత్యానికి ఫీల్ అవుతున్నా అని మోదీ తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఆశీర్వాదం ఉండాలని మోదీ అన్నారు. మోదీ నిన్న వారణాసి చేరుకున్నారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్‌తో కలిసి ఆరు కి.మీ మేర భారీ రోడ్‌షో నిర్వహించారు. ఆ తర్వాత కాశీ విశ్వనాథుడి ఆలయంలో పూజలు చేశారు. ఈప్రాంతంలో మూడోసారి పోటీకి నామినేషన్ వేయనున్నారు.