IAS Inthiyaz: మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో ఆయన పార్టీలోకి చేరారు. పార్టీ కండువా కప్పి ఇంతియాజ్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో ఇంతియాజ్ కర్నూలు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గతంలో ఆయన సెర్ఫ్ సీఈవోగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.
సీఎం జగన్ ఆశయాలతో కర్నూలు అభ్యర్థిగా పోటీ చేస్తున్నా.. వ్యక్తిగత సమస్యలు ఏవైనా అందరినీ కలుపుకుని వెళ్తాను. అసమానతలు లేని సమాజం నిర్మించాలని అడుగులు వేస్తున్నా.. కర్నూలు జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తామని ఇంతియాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కర్నూలు మేయర్ బివై రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి పాల్గొన్నారు.