»A Huge Scam In Jagananna Vidyakanuka Nadendla Manohar
Nadendla Manohar: జగనన్న విద్యాకానుకలో భారీ స్కామ్
జగనన్న విద్యా కానుకలో భారీ స్కామ్ జరిగిందని జనసేన పార్టీ వ్యవహార ఛైర్మన్ నాదెండ్ల మనోహార్ ఆరోపించారు. ఢిల్లీలో 5 కంపెనీలపై ఈడీ దాడి చేసిందని అవి ఏపీకి విద్యా కానుక కిట్లు సరఫరా చేసేవేనని పేర్కొన్నారు. నాసిరమైన షూలు, బ్యాగులు పంపిణీ చేసి విద్యార్థులకు కేటాయించిన నిధులకు గండీ కొట్టారని మండిపడ్డారు.
A huge scam in Jagananna Vidyakanuka.. Nadendla Manohar
Nadendla Manohar: వైఎస్ జగన్(YS Jagan) పాలనలో ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రంలో ఎంత దోపిడికి గురవుతుందో తెలియజేయడానికి జగనన్న విద్యా కానుక(Jagananna Vidyakanuka ) ఒక్కటి చాలని జనసేన పార్టీ వ్యవహార ఛైర్మన్ నాదెండ్ల మనోహార్(Nadendla Manohar) వ్యాఖ్యానించారు. ఈ పథకంలో భారీ స్కామ్ జరిగిందని ఆరోపించారు. నిధులను మళ్లించి నాడు-నేడు పేరిట ప్రజల్ని మభ్యపెడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చే వస్తువుల్లో నాణ్యత లేదని, పేద పిల్లలకు ఇచ్చే వాటిలో భారీ స్కామ్ జరిగిందన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మనోహర్ మాట్లాడుతూ.. గత సంవత్సరం రూ.1,050 కోట్లతో విద్యార్థులకు బ్యాగులు, షూస్ కొనుగోలు చేశారు. 42 లక్షల మంది పేద విద్యార్థుల కోసం ఆర్డర్లు ఇచ్చారు. ఈ పథకం కింద మూడేళ్లలో రూ.2400 కోట్లు ఖర్చు చేశారు. టెండర్ ప్రక్రియలో ఐదు కంపెనీలు సిండికేట్గా ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే నిధులు దారి మళ్లినట్లు ఎన్ఫోర్స్మెంట్ విచారణలో తేలిందన్నారు.
విద్యార్థులకు ఆంగ్లం నేర్పేందుకు 32వేల ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. గతేడాది రూ.300 కోట్లతో ఇంటరాక్టివ్ ఫ్లాట్స్ ప్యానెల్ తీసుకొచ్చారు. వాటికి ఇంకా డబ్బులు చెల్లించలేదు. రూ.400 కోట్లతో ఫ్లాట్ ప్యానెల్స్ కొనుగోలు పేరిట మరో కుంభకోణం జరిగిందన్నారు. పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దుతామని రూ.16వేల కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపిస్తున్నారు. నాడు-నేడు కార్యక్రమానికి నాబార్డు నుంచి రూ.1800 కోట్ల అప్పు తెచ్చారు. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.700 కోట్లు రుణం తీసుకొచ్చారని మనోహర్ పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయమని వైసీపీ చేసిన అన్ని రకాల అవినీతిని త్వరలోనే నిరూపిస్తామన్నారు. ఇది వరకే టోఫెల్, పాలవెల్లువ పథకంలో అవినీతిని జనసేన బయటపెట్టింది. ఇక విద్యాశాఖలో జరిగిన అవినీతిని కూడా బయటకు తెస్తున్నాం. ఢిల్లీలో ఐదు కంపెనీలపై ఈడీ దాడులు చేసింది. ఆ కంపెనీలే విద్యా కానుక కిట్లు సరఫరా చేస్తున్నాయని పేర్కొన్నారు. జగనన్న విద్యా కానుకలో భాగంగా నిధులు దారి మళ్లీంచారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.