Gudivada Amarnath: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు, మనోహర్ ఇద్దరు కట్టప్పలేనని విమర్శించారు. బాబు పెద్ద కట్టప్ప అయితే.. మనోహర్ చిన్న కట్టప్ప అని తెలిపారు. మనోహర్‌తో పవన్‌కు (pawan) ఎప్పటికైనా థ్రెట్ ఉంటుందని స్పష్టంచేశారు.
సీనియర్ ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్టు.. పవన్ కల్యాణ్‌కు నాదెండ్ల మనోహర్ ముప్పు ఉంటుందని అమర్ నాథ్ హెచ్చరించారు. అందుకే కాబోలు చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను నాదెండ్ల మనోహర్ చదువుతున్నారని గుర్తుచేశారు. జనసేన నేతగా నాదెండ్ల మనోహర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే పవన్ కల్యాణ్‌ను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.
చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివేసి.. పవన్ కళ్యాణ్‌తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎన్టీఆర్‌కు @ncbn వెన్నపోటు పొడిచినట్టే.. @PawanKalyanకు నాదెండ్ల వెన్నుపోటు పొడుస్తున్నారు. చంద్రబాబు పెద్ద కట్టప్ప అయితే.. మనోహర్ చిన్న కట్టప్ప.
ఇన్ఫోసిస్ ప్రారంభోత్సవం రోజు కూడా ఏదో మాట్లాడి గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేశారని తెలిపారు. సీనియర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు.. అంతకుముందు నాదెండ్ల మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కర్ కూడా వెన్నుపోటు పొడిచారని గుర్తుచేశారు. ఇప్పుడ పవన్ వెనక నాదెండ్ల ఉన్నారని.. ఆయనకు ముప్పు ఉందన్నారు. అందరూ కలిసి వచ్చి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. పారిశ్రామిక వేత్తలను ఆకర్షించే ప్రయత్నం సీఎం జగన్ చేస్తున్నారని అమర్ నాథ్ గుర్తుచేశారు. ఐటీకి ఊతం ఇస్తున్నామని.. ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు.