»Free Tickets For Ttd Srivari Kalyananam Newlyweds
TTD: కొత్త జంటలకు టీటీడీ గుడ్ న్యూస్
కొత్తగా పెళ్లి చేసుకున్న వధూవరులు తిరుపతికి వెళ్లి శ్రీవారి కళ్యాణంలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకోడడం ఆనవాయితీగా వస్తుంది. తాజాగా అలాంటి వారికిి టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి రోజు 20 టికెట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. మరి వాటిని ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
TTD: కొత్తగా పెళ్లి చేసుకున్న వారు తిరుపతిని దర్శించుకోవడం, శ్రీవారి కళ్యాణ(Srivari Kalyanani ) మహోత్సవంలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుంది. ఇలాంటి జంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ కపుల్స్ తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందే అవకాశాన్ని కల్పించింది. నూతన వధూవరులు తిరుమలకు వచ్చి శ్రీవారి కళ్యాణంలో పాల్గొని మొక్కులు తీర్చుకునే వారికి టీటీడీ(TTD) ప్రత్యేక అవకాశం కల్పిస్తోంది. జీవితంలో వచ్చే అనేక కష్ట, నష్టాలనుంచి గట్టెక్కించమని భక్తులు నిత్యం వెంకటేశ్వర స్వామిని వేడుకుంటారు. అలాగే కొత్త జంటలు కూడా సకల సౌఖ్యాలు, దాంపత్య జీవితం సాఫీగా సాగాలని శ్రీవారి కల్యాణంలో పాల్గొంటారు.
మరి కొందరు పెళ్లి ద్వారా ఒక్కటయ్యే శుభకార్యం నిర్వఘ్నంగా సాగాలని, అన్ని అనుకున్నట్లు జరిగితే స్వామి వారి కళ్యాణ సేవలో పాల్గొంటారని భక్తులు మొక్కుకుంటారు. అలా కోరిక తీరిన వారు కళ్యాణ సేవలో పాల్గొనాలని తిరుమలకు వస్తారు. చాలా మందికి టికెట్ ఎలా పొందాలో, ఎక్కడికి వెళ్లాలో తెలియక సతమతమౌతుంటారు. తాజాగా టీటీడీ ప్రకటన ప్రకారం నూతన వధూవరులకు రోజుకు 20 టికెట్లను కేటాయించింది. ఈ టికెట్ రూ.1000. ఇందులో కళ్యాణోత్సవం, ప్రత్యేక దర్శనం కలిపే ఉంటాయి. ఈ టికెట్ పొందాలంటే పెళ్ళైన కొత్త జంట ముందుగా సీఆర్వో కార్యాలయంలో ఆర్జిత సేవా లక్కీ డిప్ కౌంటర్కి వెళ్ళీ.. వధూవరుల పెళ్లి నాటి ఫోటో, వెడ్డింగ్ సమర్పించాలి. అయితే పెళ్ళి అయిన వారం రోజుల లోపే ఈ టికెట్ పొందడానికి అర్హత ఉంటుంది. వీటితో పాటుగా ఆధార్ కార్డులు కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ ద్వారా నూతన వధూవరులు నేరుగా కల్యాణోత్సవ టికెట్ పొందవచ్చని టీటీడీ అధికారులు వెల్లడించారు.