Minister రోజా నుంచి ప్రాణహానీ ఉంది.. డీజీపీని కలిసిన జంట
ఏపీ మంత్రి రోజా వల్ల తమకు ప్రాణహానీ ఉందని ఓ జంట డీజీపీని ఆశ్రయించారు. స్థానిక పోలీసులు రక్షణ కల్పించకుండా.. వారిపై మంత్రి ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.
Minister Roja: ఓ ప్రేమ జంట డీజీపీని ఆశ్రయించారు. తమకు మంత్రి (Minister) నుంచి ప్రాణహానీ ఉందని సంచలన ఆరోపణలు చేశారు. ఆ మంత్రి రోజా (Minister Roja) కాగా.. ఆరోపణలు చేసిన జంట ప్రవీణ- జిలానీ.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన ప్రవీణ (praveena), నెల్లూరుకు చెందిన జిలానీ (jeelani) గత ఆరేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు. మతం వేరు కావడంతో ప్రవీణ పేరంట్స్ పెళ్లి చేసేందుకు అంగీకరించలేదు. ఇద్దరూ లేచి పోయే అవకాశం ఉందని.. ప్రవీణకు సంబంధాలు చూడటం స్టార్ట్ చేశారు. దీంతో వారి ఊహించినట్టే పారిపోయారు.
ప్రవీణ (praveena)- జిలానీ (jeelani) పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరూ పోలీసులను (police) కలిశారు. పేరంట్స్ (parents) నుంచి ప్రాణహానీ ఉందని కోరారు. పోలీసులు (police) మాత్రం స్పందించడం లేదు. తమకు సెక్యూరిటీ ఇవ్వకుండా మంత్రి రోజా పోలీసుల మీద ప్రెషర్ చేస్తున్నారని చెబుతున్నారు. తమ ప్రాణాలకు ఏం జరిగినా మంత్రి రోజా బాధ్యత వహించాల్సి ఉంటుందని అంటున్నారు. డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. మంత్రి రోజా వల్ల తమకు ప్రాణహానీ ఉందని ప్రేమ జంట అనడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీనిపై మంత్రి రోజా స్పందించాల్సి ఉంది.