»Train Crash In Greece At Least 29 Killed Over 80 Injured
Train Crash In Greece: రైళ్లు ఢీకొని 29 మంది మృతి
గ్రీస్ లో (Greece) రెండు రైళ్లు ఢీకొన్న (Train Crash) సంఘటనలో 29 మంది మృతి చెందగా, 85 మంది వరకు గాయపడ్డారు. ఈ తీవ్ర విషాద సంఘటన గ్రీస్ దేశంలోని (Greece) లారిస్సా నగరం (Larissa City) సమీపంలోని టెంపీలో మంగళవారం జరిగింది.
గ్రీస్ లో (Greece) రెండు రైళ్లు ఢీకొన్న (Train Crash) సంఘటనలో 29 మంది మృతి చెందగా, 85 మంది వరకు గాయపడ్డారు. ఈ తీవ్ర విషాద సంఘటన గ్రీస్ దేశంలోని (Greece) లారిస్సా నగరం (Larissa City) సమీపంలోని టెంపీలో మంగళవారం జరిగింది. 350 మందితో వెళ్తున్న పాసింజర్ రైలు సరుకు రవాణా రైలును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ‘తాము రైలులో వెళ్తున్న సమయంలోనే హఠాత్తుగా భారీ శబ్దం వినిపించిందని, రైలు కిందపడిపోయిందని’ ఓ ప్రయాణీకుడు చెప్పాడు. పది సెకన్లలో అంతా అయిపోయిందని, పొగలు తప్ప ఏం కనిపించలేదని మరో ప్రయాణీకుడు చెప్పాడు. గూడ్స్ రైలును ఢీకొనడంతో మొదటి రెండు పాసింజర్ బోగీలలోనే ఎక్కువగా ప్రమాదం కనిపించింది. దీంతో ఈ రెండు బోగీలలోని వారిని రక్షించే ప్రయత్నం చేసారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. 350 మంది ప్రయాణీకులతో కూడిన పాసింజర్ రైలు రాజధాని ఏథెన్స్ నుండి గ్రీస్ లోని రెండో అతిపెద్ద నగరం థెస్సలోనికి (Thessaloniki) ప్రయాణిస్తోంది. ఈ సమయంలో ఢీకొన్నాయి. ఈ నగరం పండుగలు, సాంస్కృతిక జీవనానికి ప్రసిద్ధి. సోమవారం ప్రభుత్వ సెలవు దినం కావడం, అక్కడ నేషనల్ వైడ్ కార్నీవాల్ నేపథ్యంలో పెద్ద ఎత్తున జనాలు వచ్చారు.
రెండు రైళ్లు ఢీకొన్న తర్వాత పడిపోయిన రైలు బోగీలు, దట్టమైన పొగ, దుమ్ము, దూళి నిండిపోయింది. రెస్క్యూ టీమ్ (Rescue workers) అందరీని కాపాడేందుకు శాయశక్తులా కృషి చేస్తోంది. 200 మందికి పైగా ప్రయాణీకులను సురక్షితంగా థెస్సలోనికి (Thessaloniki) నగరానికి పంపించామని, మరో 20 మందికి పైగా ప్రయాణీకులను బస్సులో లారిస్సాకు (city of Larissa) తరలించామని గ్రీక్ ఫైర్ సర్వీస్ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనలో 85 మందికి వరకు గాయపడ్డారని, 50 మందికి పైగా తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో ఉన్నారని చెప్పారు. 17 వాహనాలు, 40 అంబులెన్స్ తో కనీసం 150 మందికి పైగా అగ్ని మాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు చెప్పారు. రెండు రైళ్లు ఢీకొన్నాయని గ్రీక్ రైల్వే కంపెనీ ప్రకటించింది. ఏథెన్స్ నుండి థెస్సాలోనికి వెళ్తున్న సరుకు రవాణా రైలును ట్రెయిన్ ఐసీ 62 ఢీకొట్టిందని తెలిపింది. రెండు రైళ్లు ఢీకొనడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పేర్కొంది. సోషల్ మీడియాలో ఈ ప్రమాదం గురించి వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి. చెల్లాచెదురుగా పడిపోయిన బోగీలు, పట్టాలు తప్పిన బోగీలు కనిపిస్తున్నాయి. ఆ పక్కనే రోడ్డు వాహనాలతో ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది.