»Womans Dance On Bhojpuri Song Inside Crowded Train
Trainలో అమ్మాయి అదిరేటి స్టెప్పులు.. వీడియో వైరల్
రద్దీ రైలులో ఓ కంటెంట్ క్రియేటర్ జోరుగా స్టెప్పులు వేసింది. స్నేహితురాలు కూడా తోడై.. ఇద్దరు చక్కగా డ్యాన్స్ చేశారు. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.
Woman's Dance On Bhojpuri Song Inside Crowded Train
Train: సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎప్పుడు, ఎక్కడ ఏం చేసిన సంచలనమే.. అవును ఇక క్రియేటివ్‌గా ఆలోచించే వారికి, పాటలు పాడే వారికి, డ్యాన్స్ చేసే వారి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఢిల్లీ మెట్రోలో (metro) డ్యాన్స్ ఘటనలు చాలానే చూశాం. కాంట్రవర్సీ ఇన్సిడెంట్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఓ కంటెంట్ క్రియేటర్ రద్దీ ట్రైన్లో జోష్‌గా స్టెప్పులు వేసింది. ఆ వీడియో షేర్ చేయగా వైరల్ అవుతోంది.
రైలులో (rail) భోజ్ పురి పాటకు జయ జెర్నీ (jaya jerry) అనే కంటెంట్ క్రియేటర్ డ్యాన్స్ చేశారు. ఆమెకు సోషల్ మీడియాలో చాలా మంది ఫాలొవర్లు ఉన్నారు. గ్రే టాప్ వేసుకొని, బ్లాక్ జీన్స్ వేసుకున్న అమ్మాయి.. కేశరిలాల్ యాదవ్ పాట సజ్ కే సవార్ కే పాటకు కంపర్ట్ మెంట్లో అదిరేటి స్టెప్పులు వేశారు. ఆ వీడియో ముగిసే సమయానికి స్నేహితురాలు కూడా వచ్చి డ్యాన్స్ చేసింది. ఇద్దరు కలిసి చక్కగా స్టెప్పులు వేశారు. డ్యాన్స్ చేసే సమయంలో మరో ఇద్దరు పడుకున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఆ వీడియోకు భోజ్ పురి లవర్స్.. వీడియో ఎలా ఉందో చెప్పాలని క్యాప్షన్ రాశారు.
ఆ వీడియోకు 1.7 లక్షల లైక్స్ వచ్చాయి. 7 మిలియన్ వ్యూస్ వచ్చాయి. వేలాది మంది కామెంట్స్ చేశారు. యువతి (jaya jerry) కాన్ఫిడెన్స్‌ను చాలా మంది ప్రశంసించారు. మీరు ఆ రీల్ ఎక్కడ తీశారో చెప్పాలని మరికొందరు అడిగారు. అలా చేయడం న్యూసెన్స్ అని చాలా మంది అభిప్రాయపడ్డారు. యువతిపై చర్యలు తీసుకోవాలని భారతీయ రైల్వేను డిమాండ్ చేశారు.