»Special Invitaion For Brs From Lok Sabha Secretariat For Bac
BAC Meeting: బీఆర్ఎస్కు గుర్తింపు లేదు.. ప్రత్యేక ఆహ్వానమే!
తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) కొద్ది నెలల క్రితం భారత రాష్ట్ర సమితి (BRS)గా మారింది. అయినప్పటికీ లోకసభ సచివాలయం ఇప్పటికీ గుర్తింపు ఇవ్వలేదు. బీఏసీ (BAC) నుండి టీఆర్ఎస్ (TRS)ను తొలగించింది.
తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) కొద్ది నెలల క్రితం భారత రాష్ట్ర సమితి (BRS)గా మారింది. అయినప్పటికీ లోకసభ సచివాలయం ఇప్పటికీ గుర్తింపు ఇవ్వలేదు. బీఏసీ (BAC) నుండి టీఆర్ఎస్ (TRS)ను తొలగించింది. ఇప్పటి వరకు ఆ పార్టీకి నామా నాగేశ్వర రావు (Nama Nageswara Rao) బీఏసీ (BAC) సభ్యుడిగా ఉన్నారు. ఇటీవల బీఆర్ఎస్ గా మారింది. అయితే నేడు జరిగిన బీఏసీ సమావేశానికి నామాను ప్రత్యేక ఆహ్వానితుడిగానే సచివాలయం ఇన్వైట్ చేసింది. ఆరుగురు సభ్యుల కంటే ఎక్కువమంది ఉన్న పార్టీకి బీఏసీ (BAC)లో సభ్యత్వం ఉంటుంది. TRS/BRS పార్టీకి లోకసభలో తొమ్మిది మంది సభ్యులు ఉన్నప్పటికీ లోకసభ సచివాలయం తొలగించింది. లోకసభ బీఏసీలో బీఆర్ఎస్ ప్రత్యేక ఆహ్వానిత పార్టీగా కొనసాగనుంది. అంటే ఆహ్వానం పంపిస్తేనే బీఏసీకి రావాల్సి ఉంటుంది.
మంత్రిత్వ శాఖల వారీగా డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ పైన చర్చించేందుకు బేఏసీ సమావేశం ఉన్నట్లు లోకసభ సచివాలయం సమాచారం పంపించింది. బీఏసీ సమావేశ సమాచారంలో విషయం బయటపడింది. బీఆర్ఎస్కు ప్రస్తుతం లోకసభలో 9 మంది సభ్యులు ఉన్నారు. దీంతో లోకసభ సచివాలయం ఆహ్వానితుల జాబితాలోకి తీసుకుంది. 2022 అక్టోబర్ 5వ తేదీన పార్టీ పేరు మార్పుపై ఎన్నికల సంఘానికి (EC) ఆ పార్టీ లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ ఈసీ ఆమోదం తెలిపింది. టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్గా మారి దాదాపు మూడు నెలలు అవుతున్నా కూడా లోకసభ సచివాలయం మాత్రం ఆ పార్టీకి గుర్తింపును ఇవ్వలేదు.