»India Bowled Out For 109 Lyon Wins Another Round Of Battle With Pujara
IND vs AUS 3rd Test Day: 109 రన్స్కే కుప్పకూలిన భారత్, పుజారా వరస్ట్ రికార్డ్
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా కుప్పకూలింది. వరుసగా రెండు టెస్టుల్లో ఆసీస్ ను ఓడించిన భారత్.. తాజా టెస్టులో మాత్రం తేలిపోయింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా వరుసగా వికెట్లను కోల్పోయింది.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో (border gavaskar trophy) భాగంగా భారత్ – ఆస్ట్రేలియా (India Vs Australia) మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా (Team India) కుప్పకూలింది. వరుసగా రెండు టెస్టుల్లో ఆసీస్ ను ఓడించిన భారత్.. తాజా టెస్టులో మాత్రం తేలిపోయింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ (Batting) ఎంచుకున్న టీమిండియా (Team India) వరుసగా వికెట్లను కోల్పోయింది. తొలి సెషన్ లోనే ఏడుగురు పెవిలియన్ చేరారు. ఆసిస్ స్పిన్నర్ల (Australia Spinners) దాటికి లంచ్ సమయానికే భారత్ 7 వికెట్లు కోల్పోయి కేవలం 84 పరుగులు మాత్రమే చేసింది. లంచ్ బ్రేక్ తర్వాత కూడా మరో మూడు వికెట్లు టపటపా పడిపోయాయి. బ్యాట్స్ మెన్ అందరూ విఫలమయ్యారు. ఇండోర్ హోల్కర్ స్టేడియం పిచ్ పైన ఆసిస్ స్పిన్నర్లు కునెమన్ (Matthew Kuhnemann), నాథన్ లయన్ (Nathan Lyon) బంతిని తిప్పేశారు. వీరిద్దరు వరుసగా ఐదు, మూడు వికెట్లు తీశారు. ఏ ఒక్కరు కనీస ప్రదర్శన చేయలేకపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohith Sharma) ఆరో ఓవర్ లో కునెమన్ బౌలింగ్ లో 12 పరుగులకే స్టంప్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత శుభ్ మన్ గిల్ (21) అతని బౌలింగ్ లోనే స్మిత్ కు క్యాచ్ ఇచ్చాడు. తర్వాత ఓవర్లో చటేశ్వర పుజారా (1)ను నాథన్ లయన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ పైన అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కుదురుకున్నట్లుగా కనిపించినప్పటికీ.. వికెట్ల పతనం కొనసాగింది. రవీంద్ర జడేజా (4)ను నాథన్ ఔట్ చేయగా.. శ్రేయస్ అయ్యర్ (0)ను కునెమన్ డకౌట్ చేశాడు. కేఎస్ భరత్ (17) తో కలిసి విరాట్ కోహ్లీ (22) ఆరో వికెట్ కు 25 పరుగులు జోడించడంతో భారత్ ఆశాజనకంగా కనిపించింది. కానీ, 22వ ఓవర్లో కోహ్లీని ఎల్బీ చేసిన మర్ఫీ ఈ జంటను విడదీశాడు. ఆ తర్వాత నాథన్ బౌలింగ్ లో కేఎస్ భరత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 26 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. లంచ్ తర్వాత అశ్విన్ కూడా అవుటయ్యాడు. 31వ ఓవర్లో వచ్చిన ఉమేష్ యాదవ్ సిక్స్ కొట్టడంతో భారత్ ట్రిపుల్ డిజిట్ ను తాకింది. ఉమేష్ వచ్చీ రావడంతోనే వరుసగా 6, 6 , 4 కొట్టాడు. అయితే అదే ఊపులో ఉమేష్ యాదవ్ (17)… మాథ్యూ కునెమన్ కు దొరికిపోయాడు. ఆ తర్వాత వచ్చిన సిరాజ్ కూడా వెంటనే అవుటయ్యాడు. దీంతో భారత్ 109 పరుగులకే ఆలౌట్ అయింది. కాగా, తొలి రెండు టెస్టుల్లో నెగ్గిన భారత్ నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో ప్రస్తుతం 2–0తో ఆధిక్యంలో ఉంది. అక్షర్ పటేల్ నాటౌట్ గా ఉన్నాడు.
చటేశ్వర పుజారా ఈ ఇన్నింగ్స్ లో నాలుగు బంతులు ఎదుర్కొని, ఒక పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. నాథన్ లియోన్ అతనిని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో పుజారా ఒక చెత్త రికార్డును తన పేరున లిఖించుకున్నాడు. ఒక బౌలర్ చేతిలో అత్యధికసార్లు అవుటైన జాబితాలో చేరాడు. పుజారాను లియోన్ అవుట్ చేయడం ఇది పన్నెండోసారి. అంతకుముందు ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ కూడా పుజారాను 12సార్లు అవుట్ చేశాడు. గతంలో సునీల్ గవాస్కర్… అండర్ వుడ్ చేతిలో 12సార్లు అవుటయ్యాడు. ఒక బౌలర్ చేతిలో అత్యధికసార్లు అవుటైన మొదటి ఆటగాడు గవాస్కర్ తర్వాత ఈ వరస్ట్ రికార్డుతో పుజారా రెండో ఆటగాడు అయ్యాడు.