»Rashmi Gautam Comments On Naga Shaurya Lovers Incident
Naga Shauryaపై యాంకర్ రష్మీ ప్రశంసలు.. సిగ్గుందా అంటూ వారిపై ఆగ్రహం
‘లవర్స్ మధ్య వంద ఉంటాయి. వారి మధ్య వెళ్లడం అవసరమా? వాళ్ల విషయంలో తలదూర్చడం సరికాదు. ఈ సంఘటనతో అమ్మాయి వాళ్ల ఇంట్లో తెలిస్తే పరిస్థితి ఏంటి?’ ఓ నెటిజన్ ప్రశ్నించాడు. ‘వాడి లవర్ వాడి ఇష్టం. ఆమె ఏం తప్పు చేసిందో ఎవరికి తెలుసు? మధ్యలో నీకు ఎందుకు శౌర్య?
నడి రోడ్డుపై ప్రేమికులు గొడవ పడుతుండడంతో యంగ్ హీరో నాగశౌర్య (Naga Shaurya) స్పందించి సర్దుబాటు చేసే ప్రయత్నం చేశాడు. తన ప్రేయసిని యువకుడు కొట్టడంతో నాగశౌర్యకు ఆగ్రహం తెప్పించింది. యువతిని క్షమించాలని (Say To Sorry) కోరాలని ఆ యువకుడి చేయి పట్టుకుని శౌర్య డిమాండ్ చేశాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు శౌర్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ‘అతడి లవర్ ఆయన ఇష్టం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్లపై యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) ఆగ్రహం వ్యక్తం చేసింది. సిగ్గుండాలి (Shame) అలా అనేందుకు అంటూ మండిపడింది. ఇక రష్మీ చేసిన కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
యువ నటుడు శౌర్య చూపిన తెగువను జబర్దస్త్ (Jabardasth) యాంకర్, నటి రష్మీ గౌతమ్ ప్రశంసించింది (Praised). శౌర్యపై ప్రశంసలు కురిపిస్తూనే ఈ సంఘటనను సమర్ధిస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘వాడి లవర్ వాడి ఇష్టమట. అమ్మాయే సపోర్ట్ అట. ఆ వీడియో కింద వచ్చిన కామెంట్స్ చూస్తే సిగ్గుగా ఉంది. ఆ అమ్మాయి ఎలాంటి ఒత్తిడిని అనుభవిస్తుందో ఎవరికి తెలుసు. మరో ఆత్మహత్య జరగడం కోసం మీరు ఎదురుచూస్తున్నారా?’ అని యాంకర్ ట్వీట్ చేసింది.
ఈ సందర్భంగా ఆ వీడియో కింద నెటిజన్లు చేసిన కామెంట్లను స్క్రీన్ షాట్లు తీసి పోస్టు చేసింది. ‘లవర్స్ మధ్య వంద ఉంటాయి. వారి మధ్య వెళ్లడం అవసరమా? వాళ్ల విషయంలో తలదూర్చడం సరికాదు. ఈ సంఘటనతో అమ్మాయి వాళ్ల ఇంట్లో తెలిస్తే పరిస్థితి ఏంటి?’ ఓ నెటిజన్ ప్రశ్నించాడు. ‘వాడి లవర్ వాడి ఇష్టం. ఆమె ఏం తప్పు చేసిందో ఎవరికి తెలుసు? మధ్యలో నీకు ఎందుకు శౌర్య?’ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ‘రోడ్డుపై అతడు కొట్టాడు అంటే ఆమె ఏం తప్పు చేసిందో’ అని మరో వ్యక్తి కామెంట్ చేసి ఆ అబ్బాయికి మద్దతు తెలిపాడు.
ఫిబ్రవరి 28న హైదరాబాద్ లో నాగశౌర్య రోడ్డు (Road)పై వెళుతున్న క్రమంలో ఓ యువకుడు అమ్మాయిని (Girl Friend)పై రోడ్డుపై కొట్టడాన్ని చూశాడు. నడిరోడ్డుపై అమ్మాయిపై దాడి చేయడంతో శౌర్య అవాక్కయ్యాడు. వెంటనే కారు దిగి శౌర్య ‘యువతిని ఎందుకు కొట్టావు’ అని నాగశౌర్య నిలదీశాడు. ఆ యువకుడి చేయి పట్టుకుని సారీ కోసం డిమాండ్ చేశాడు. అయితే ఆ యువకుడు క్షమాపణ చెప్పకపోవడంతో అతడిని అలాగే చేయి పట్టుకున్నాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం ‘ఆమె నా లవర్ (Lover). నేను క్షమాపణ చెప్పను’ అని చెప్పి వెళ్తున్నాడు. అదే ప్రాంతంలో రోడ్డుపై ఉన్నవారు కూడా సారీ చెప్పు భయ్యా అని అనడం వీడియోలో చూడవచ్చు. ‘నా లవర్ కు నేనేందుకు క్షమాపణ చెబుతా’ అని చెబుతూ యువకుడు వెళ్లిపోయాడు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు మాత్రం తెలియలేదు. కానీ శౌర్య చొరవను అందరూ ప్రశంసిస్తున్నారు.
Vadi lover vadi istam anta Ammai ne support anta The comments below are so damn shameful What kind of pressure tat girl is in who knows Do u really hav to wait for another suicide to happen https://t.co/xHGmwkIP5dpic.twitter.com/5tc7AwjalK