»Producer Dil Raju Praised To Telangana Cm Kcr And Minister Ktr
Balagam Movie కేసీఆర్, కేటీఆర్ కు దిల్ రాజ్ సెల్యూట్.. మరోసారి నవ్వులే నవ్వులు
తెలంగాణను కొత్త రాష్ట్రంగా భారతదేశ మ్యాప్ లో తీసుకువచ్చిన కేసీఆర్ కు, నాటి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు. తెలంగాణను కేసీఆర్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకువచ్చారో అందరికీ తెలుసు. తెలంగాణ సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్ ది. తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో గొప్పగా నిలుపుతున్న కేటీఆర్ కు ధన్యవాదాలు.
తెలంగాణ (Telangana) పల్లెటూరు నేపథ్యంలో రూపుదిద్దుకున్న ‘బలగం’ (Balagam Movie) సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. ఈ సినిమాలో ప్రియదర్శి (Priyadarshi Pulikonda), కావ్య కల్యాణ్ రామ్ (Kavya Kalyanram) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలై అందరినీ ఆకట్టుకుంటోంది. జబర్దస్త్ నటుడు వేణు ఎల్దండి (Venu Yeldandi) దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక తెలంగాణలోని సిరిసిల్లలో మంగళవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ కేటీఆర్ ను ప్రశంసల్లో ముంచెత్తాడు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసలు కురిపించాడు.
ప్రీ రిలీజ్ వేడుకలో తెలంగాణ ప్రభుత్వంపై దిల్ రాజు ఇలా మాట్లాడాడు.. ‘సిరిసిల్లతో నాకు ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. సిరిసిల్ల, వేములవాడ ప్రాంతంలో చాలాసార్లు తిరిగాను. ఇప్పుడు సిరిసిల్ల అద్భుతంగా తయారైంది. హైదరాబాద్ కు ఏమాత్రం తీసిపోని విధంగా రోడ్లు ఉన్నాయి. తెలంగాణను కొత్త రాష్ట్రంగా భారతదేశ మ్యాప్ లో తీసుకువచ్చిన కేసీఆర్ కు, నాటి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు. తెలంగాణను కేసీఆర్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకువచ్చారో అందరికీ తెలుసు. తెలంగాణ సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్ ది. తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో గొప్పగా నిలుపుతున్న కేటీఆర్ కు ధన్యవాదాలు. 2006లో కేటీఆర్ ను మొదటిసారి కలిశాను. ఎప్పుడూ కలిసినా ఆయన ముఖంలో అదే చిరునవ్వు కనిపిస్తుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం మామూలు విషయం కాదు. ఆ గొప్ప సంస్కారం ఆయనకు సీఎం కేసీఆర్ నుంచి వచ్చింది. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడు. కేటీఆర్ వంటి నాయకుడిని ఈ తరానికి అందించారు. తెలంగాణ యాస, భాష అన్ని బలగం సినిమాలో ఉన్నాయి. మన గుండెకాయలాంటి సినిమా ఇది’ అని దిల్ రాజు ప్రసంగం ముగించాడు.
ఇక సినిమా విషయం దిల్ రాజు మాట్లాడుతూ ‘తెలంగాణ నేపథ్యంలో వచ్చే సినిమాలు సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. ఫిదా సినిమా అలాంటిదే. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తీసిన సినిమా బలగం. మన యాస ఎంతో ప్రేమతో కూడుకున్నది. అద్భుతమైన కథతో వేణు బలగం సినిమా తీశాడు. తెలంగాణ సంస్కృతిపై తీసిన బలగం గొప్ప సినిమా ఇది. ఎంతో ప్రతిభ ఉన్న కొత్త వారితో ఈ సినిమాను తెరకెక్కించాం’ అని తెలిపాడు. ఇటీవల తమిళ భాషతో వైరల్ గా మారిన డైలాగ్ లను మరోసారి దిల్ రాజు మాట్లాడాడు. ‘బలగం సినిమాలో ఫైట్లు ఇల్లే.. డ్యాన్స్ ఇల్లే.. ఈ సినిమాలో విజయ్ సార్ లాంటి బాడీ ఇల్లే. సూపర్ ఎంటర్ టైన్ మెంట్ ఇరుక్కు. సూపర్ ఎమోషన్స్ ఇరుకు.. సూపర్ తెలంగాణ నేటివిటీ ఇరుక్కు’ అంటూ తమిళ భాషలో మాట్లాడి దిల్ రాజు అందరినీ నవ్వుల్లో ముంచాడు.