»Bhadrachalam Brahmotsavam 2023 Bhadrachalam Kalyanotsavam Tickets Released
Rama Navami 2023 రామయ్య కల్యాణం చూద్దాం రండి.. టికెట్లు విడుదల
భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సకల సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ పాలక మండలి సిద్ధమైంది. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశాల మేరకు పాలకమండలి ప్రత్యేక ఏర్పాట్లు చేయిస్తున్నది. ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది.
తెలంగాణ (Telangana)లో కొలువైన భద్రాచలం సీతా రామచంద్రస్వామి ఆలయం (Bhadrachalam Sree Seetha Ramachandra Swamy Temple)లో శ్రీరామనవమి (Sri Rama Navami) వేడుకలకు సిద్ధమవుతున్నది. దేశంలోనే ప్రసిద్ధి పొందిన ఈ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. నవమి నాడు జరిగే సీతారామచంద్రుల కల్యాణోత్సవానికి దేశం నలువైపులా నుంచే కాకుండా విదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఈ కల్యాణోత్సవం కనులారా వీక్షించాలని భక్తులు భావిస్తుంటారు. అలాంటి వారికి శుభవార్త. మార్చి 30న శ్రీరామనవమి నాడు జరిగే కల్యాణోత్సవానికి టికెట్లు (Tickets) అందుబాటులో ఉంచారు.
భద్రాచలం సీతా రామచంద్రస్వామి ఆలయంలో ఈనెల 22 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు (Bhadrachalam Brahmotsavam-2023) జరుగనున్నాయి. ఈనెల 30న ఆలయ సమీపంలోని మిథిలా మండపం (Mithila Mandap)లో కల్యాణోత్సవం వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఈ కల్యాణోత్సవ టికెట్లను బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చాయని ఆలయ ఈవో రమాదేవి ప్రకటించారు. మొత్తం 16,860 టికెట్లు అందుబాటులో ఉంచామని, వాటిలో రూ.7,500, రూ.2,500, రూ.2 వేలు, రూ.వెయ్యి, రూ.300, రూ.150 టికెట్లు ఉన్నాయని వివరించారు. రూ.7,500 టికెట్ పై ఇద్దరికి ప్రవేశం కల్పించి స్వామివారి ప్రసాదం అందజేస్తారు. మిగతా టికెట్లపై ఒకరికే మాత్రమే అవకాశం ఉంటుందని ఈవో తెలిపారు. స్టేడియంలో 15 వేల మంది ఉచితంగా ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక మార్చి 31వ తేదీన నిర్వహించే శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం కార్యక్రమానికి సంబంధించిన టికెట్లు కూడా అందుబాటులో ఉంచామని, ఈసారి 3 రకాల ధరలతో టికెట్లను విక్రయిస్తున్నట్లు ఈవో ప్రకటించారు. కల్యాణోత్సవంలో భక్తులు తరించాలని ఆమె కోరారు. టికెట్లను ఆలయ అధికారిక వెబ్ సైట్ https://www.bhadrachalarama.org/లో గానీ, ఆలయ కార్యాలయంలో నేరుగా గానీ పొందవచ్చు.
కాగా భద్రాది కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District)లో కొలువైన ఈ క్షేత్రానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. భద్రాచలంలో కనులపండువగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వీఐపీలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ కల్యాణోత్సవానికి గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ (Tamilisai Soundararajan)తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇటీవల భద్రాద్రి రాముడిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించిన విషయం తెలిసిందే.
భారీగా ఏర్పాట్లు
భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సకల సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ పాలక మండలి సిద్ధమైంది. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశాల మేరకు పాలకమండలి ప్రత్యేక ఏర్పాట్లు చేయిస్తున్నది. ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నారు. కాగా భద్రాచలం వచ్చేందుకు రోడ్డు, రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ తో పాటు ఏపీలోని ఇతర ప్రాంతాల నుంచి భద్రాచలానికి అనేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ లో రైలు దిగుతుంది. ఇక బస్సు సదుపాయం అన్ని ప్రాంతాల నుంచి ఉంది.