»Real Estate Companies Is Target Income Tax Officers Raids In Hyderabad
IT Raids తెలంగాణలో మళ్లీ ఐటీ దాడులు.. ఏకంగా 20 చోట్ల సోదాలు
వరుసగా దాడులు చేస్తుండడంతో కలకలం రేపుతున్నది. అధికార పార్టీనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐటీతో పాటు ఈడీ (Enforcement Directorate) దాడులు కూడా తరచూ జరుగుతున్నాయి.
ఆదాయ పన్ను శాఖ (Income Tax Officers) అధికారులు తెలంగాణ (Telangana)పై పూర్తి దృష్టి సారించారు. ఇటీవల చాలా సార్లు తనిఖీలు చేపట్టగా.. తాజాగా మంగళవారం మరోసారి ఐటీ దాడులు (IT Raids) జరిగాయి. హైదరాబాద్ (Hyderabad)లోని పలు చోట్ల బృందాలుగా విడిపోయి పలు సంస్థల కార్యాలయాలు, కొందరి ఇళ్లల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ లోని వివిధ చోట్ల ఐటీ దాడులు జరగడం కలకలం రేపింది. కొందరిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు తెలుస్తున్నది.
ఏకకాలంలో గూగి రియల్ ఎస్టేట్ (Googee Properties) కంపెనీ కార్యాలయాలు, అధికారుల నివాసాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. దాదాపు 20 చోట్ల రియల్ ఎస్టేట్ కంపెనీల డైరెక్టర్ల నివాసాల్లో తనిఖీలు చేస్తున్నారు. గూగి కంపెనీ ఫార్మా హిల్స్, వండర్ సిటీ, రాయల్ సిటీ పేర్లతో హైదరాబాద్ లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నది. దిల్ సుఖ్ నగర్ (Dilsukhnagar)లోని గూగి ప్రధాన కార్యాలయంలో ఐదు బృందాలు దాడులు చేస్తున్నట్లు సమాచారం. ఈ కంపెనీ యజమాని యాసిన్ ఫాతిమా అక్బర్ షేక్ ఇళ్లలో దాడులు కొనసాగుతున్నాయి.
జనవరి 31వ తేదీన కూడా ఐటీ అధికారులు తెలంగాణలో తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో దాదాపు 50 బృందాలు దాదాపు 40 చోట్ల తనిఖీలు చేపట్టారు. కొన్ని నెలలుగా హైదరాబాద్ లోని వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారిపై ఐటీ దృష్టి సారించింది. వరుసగా దాడులు చేస్తుండడంతో కలకలం రేపుతున్నది. అయితే అధికార పార్టీనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐటీతో పాటు ఈడీ (Enforcement Directorate) దాడులు కూడా తరచూ జరుగుతున్నాయి.