»Guntur District Trees Cutdown In Tenali For Ys Jagan Meeting
Tenali Meeting అదే ప్రచార యావ.. వైసీపీ పిచ్చి పీక్స్
జగన్ ఎక్కడ పర్యటిస్తే అక్కడ ప్రజలు తీవ్ర కష్టాలు పడాల్సిన పరిస్థితి. దీనిపై ప్రతిపక్షాలు సీఎం జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెనాలి పర్యటన సమయంలో కూడా అవే దృశ్యాలు కనిపించాయి. కానీ ఈసారి వైసీపీ మరింత రెచ్చిపోయి చివరకు మొక్కజొన్న కంకులకు కూడా పార్టీ రంగులు (YCP Colors) వేయడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి (Govt of AP) పాలన కన్నా ప్రచార యావపైనే పూర్తి దృష్టి. చేసేది ఏమీ లేదు.. కానీ ప్రచారం (Publicity) మాత్రం భారీ స్థాయిలో ఉంటోంది. న్యాయస్థానాలు ఎన్ని మొట్టి కాయలు వేసినా ప్రభుత్వంలో మాత్రం మార్పు లేదు. ప్రభుత్వ కార్యక్రమాలకు పార్టీ వేయవద్దు అని ఎవరూ చెప్పినా సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) వినిపించుకోవడం లేదు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీ భవనాలు, అంగన్ వాడీ కేంద్రాలు, పాఠశాలలు ఇలా ఏది కనిపించినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) రంగులు వేసేస్తున్నారు. ఇక జగన్ ఎక్కడ పర్యటిస్తే అక్కడ చెట్లు నరికివేయడం, రోడ్లు దిగ్బంధించడం, విద్యాలయాలకు సెలవులు ప్రకటించడం, సమస్యలు కనిపించకుండా పరదాలు వేయడం, రోడ్లు బాగా లేకుంటే ఆగమేఘాల మీద నాసిరకం పనులు చేయడం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. తాజాగా తెనాలి పర్యటన సమయంలో కూడా అవే దృశ్యాలు కనిపించాయి. కానీ ఈసారి వైసీపీ మరింత రెచ్చిపోయి చివరకు మొక్కజొన్న కంకులకు కూడా పార్టీ రంగులు (YCP Colors) వేయడం గమనార్హం.
చదవండి: బడ్జెట్ పై మేల్కొన్న ఏపీ ప్రభుత్వం.. 14 నుంచి సమావేశాలు
మీట నొక్కి డబ్బులు పంచుడు కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ (YSR Raithu Bharosa- PM Kisan)లో భాగంగా గుంటూరు జిల్లా (Guntur District) తెనాలి (Tenali)లో సీఎం జగన్ పర్యటించనున్నాడు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి గతంలో చాలా చోట్ల చేసిన మాదిరి ఇక్కడ కూడా ఆ విధంగా ఏర్పాట్లు జరిగాయి. జగన్ కోసం ఏకంగా మార్కెట్ యార్డు గోడను కూల్చేసి కొత్త మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఉన్న మార్గం కాదని జగన్ కోసం కొత్తగా మార్గం నిర్మించారు. ఇక ఈ మార్గానికి ఇరువైపులా ఉన్న పచ్చటి చెట్లను తొలగించారు. కొమ్మలను నరికేశారు. ఇక వాటికి వైఎస్సార్ సీపీ రంగులు వేశారు. తెనాలి మొత్తం వైసీపీ రంగులు పూశారు. యార్డు లోపల, బయట, విద్యుత్ స్తంభాలు, హెలిప్యాడ్ నుంచి సభ వరకు మొత్తం రంగులు నింపేశారు. ఇక అలంకరణకు వాడే మొక్కజొన్న కంకులకు కూడా రంగులు వేయడం విస్మయానికి గురి చేస్తోంది.
ఇక జగన్ పర్యటనతో తెనాలిలో తీవ్ర ఆంక్షలు అమలు చేసినట్లు తెలుస్తున్నది. స్థానికంగా సాధారణ ప్రజలు ఈ కార్యక్రమంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం నుంచే ఏర్పాట్లు చేస్తుండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇక జగన్ పర్యటన రోజు పట్టణాన్ని పోలీసులు పూర్తిగా నిర్బంధంలోకి తీసుకున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రజలను తరలించేందుకు కొన్ని విద్యాలయాలకు సెలవులు ప్రకటించినట్లు సమాచారం. వారిని బస్సుల్లో సభ కార్యక్రమానికి తరలించేందుకు వైసీపీ నాయకులు ఏర్పాట్లు చేశారు. ఇక ఈ సభకు జనాలను తరలిచ్చేందుకు ఆర్టీసీ బస్సులు అధికంగా వాడడంతో గుంటూరు జిల్లాలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలా జగన్ ఎక్కడ పర్యటిస్తే అక్కడ ప్రజలు తీవ్ర కష్టాలు పడాల్సిన పరిస్థితి. దీనిపై ప్రతిపక్షాలు సీఎం జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.