ఆంధ్రప్రదేశ్లో విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల తరచూ బెంగళూరు పర్యటనలు చేస్తూ, తన అనుచరులను అసంతృప్తికి గురిచేస్తున్నారు. కారణాలు ఏమైనా కానీ, ఈ తరచూ ప్రయాణాలు ఆయన్ని వెంటాడుతున్న అనుచరులను కలచివేస్తున్నాయి. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏపీ కి అతిదుల్లా వస్తుంటారని, వారు హైదరాబాద్ లోనే ఉంటూ, పార్ట్ టైం పొలిటిషన్స్ పాత్ర పోశిష్ఠున్నారని పలుసార్లు విమర్శలు చేసారు. వైసీపీ లో ఉన్న మాజీ మంత్రులు. ముఖ్య నేతలు కూడా ఈ విమర్శలు చేశారు. ఇప్పుడు మీరు చేస్తుందేంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
విజయవాడలో తన అభిమాని, కార్యకర్తలు, పార్టీకి చెందిన పలువురు నేతలు, జగన్ తరచూ ఇతర రాష్ట్రాలకు వెళ్లడం, ముఖ్యంగా బెంగళూరు పర్యటనలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారు జగన్ పర్యటనలు మరింత జాతీయ స్థాయిలో వుండాలని, రాష్ట్రం లోనే ఉండి పలు ప్రాంతాలలో పార్టీ కార్యకలాపాలను మరింత బలంగా చేయాలని కోరుకుంటున్నారు.
వైఎస్ జగన్ బెంగళూరు పర్యటనల కారణంగా పార్టీలో వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితిని సరిచేసే అవసరం పై, పార్టీ తక్షణ చర్యలు తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఏపీ లో ఉండి ప్రభుత్వ తప్పిదాలపై పోరాడితే పార్టీ ఆత్మవిశ్వాసం, ఉత్సాహం మరింత పెరుగుతాయని అభిమానులు ఆశిస్తున్నారు.