CTR: పూతలపట్టు మండలం కిచ్చన్న గారి పల్లి సమీపంలో ఆరు లైన్ల జాతీయ రహదారిపై లారీని బస్సు ఢీకొంది. స్థానికుల సమాచారం మేరకు.. సోమవారం రాత్రి ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ప్రయివేట్ బస్సు ఢీకొట్టింది. బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.