CTR: సోమల మండలం పొదలకుంటపల్లెకు చెందిన మహేశ్ (39) ఈనెల 17న బైక్ పై పీలేరుకు బయలుదేరాడు. మార్గమధ్యంలో సదుం మండలం పుట్టావారిపల్లె క్రాస్ వద్ద ఆవు అడ్డురావడంతో తప్పించబోయి కిందపడి గాయపడ్డాడు. చికిత్స కోసం తిరుపతి రుయాకు తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.