»After 8 Months Once Again Lpg Cylinder Price Increased
LPG Gas Price సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్ ధర.. ఎంతైందంటే..?
కేంద్ర ప్రభుత్వం తమ నడ్డి విరుస్తోందని ప్రజలు వాపోతున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తమపై గుదిబండ మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ల సేవలో మునిగి తేలుతున్న మోదీ ప్రజలపై మాత్రం మోయలేని భారం మోపుతున్నారని విమర్శిస్తున్నాయి. బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంటున్నాయి.
వంటింట్లోకి (Kitchen) వెళ్లాలంటే మహిళలకు భయమైతుంది. ఉప్పు, పప్పు, నూనె ధరలు భారీగా పెరుగుతుండడంతో వండుకుని తిందామంటే భయపడాల్సి వస్తోంది. నిత్యావసర ధరలు (Price Hike) భారీగా పెరుగుతుండడంతో సామాన్యులు (Commanman) వాటిని భరించలేకపోతున్నారు. దీనికి తోడు గ్యాస్ ధర (LPG Gas Cylinder) క్రమేణా పెరుగుతూ వస్తోంది. గ్యాస్ ధరకు రెక్కలు వచ్చాయి. అడ్డూఅదుపు లేకుండా పెరుగుతుండడంతో రూ. వెయ్యి మార్క్ దాటేసింది. తాజాగా మరో రూ.50 ధర పెరిగింది. ఈ వార్తతో పేదలతోపాటు మధ్య తరగతి జీవులు షాక్ కు గురయ్యారు. ఇంటికే కాదు కమర్షియల్ గ్యాస్ ధరలు కూడా భారీగా కేంద్ర ప్రభుత్వం (Govt Of India) పెంచేసింది. తాజాగా సవరించిన ధరలతో రూ.50 పెంచుతున్నట్లు గ్యాస్ కంపెనీ (Gas Companies)లు ప్రకటించాయి. తాజాగా పెంచిన ధరతో గ్యాస్ ఎంత ఉందో తెలుసుకోండి.
గృహ వినియోగ గ్యాస్ (Domestic Gas)పై రూ.50, వాణిజ్య సిలిండర్ (Commercial Gas) గ్యాస్ పై రూ.350.50 పెంచుతూ చమురు కంపెనీలు (Oil companies) నిర్ణయించాయి. ఈ పెరిగిన ధరలు తక్షణమే బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. తాజాగా పెరిగిన ధరలతో ఢిల్లీ (New Delhi)లో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,103కు చేరింది. ఇక వాణిజ్య సిలిండర్ ధర రూ.2,119కి చేరింది. ఇక హైదరాబాద్ (Hyderabad)లో గృహ వినియోగ గ్యాస్ ధర రూ.1,1175కు చేరింది. గతేడాది జూలైలో పెంచిన ధర తాజాగా 8 నెలల తర్వాత రూ.50 పెంచాయి.
ఈ పెరిగిన ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బదులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే గ్యాస్ వెయ్యి దాటగా తాజాగా పెంచిన ధరలతో రూ.1,115కు చేరడంతో గ్యాస్ కు దండం పెడుతున్నారు. ఇక పేదలైతే మళ్లీ కట్టెల పొయ్యికి మారుతున్నారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ వినియోగం తగ్గి కట్టెల పొయ్యిలు వాడడం మొదలైంది. ఇక పెట్రోల్, డీజిల్ ధరలతో కూడా సతమతమవుతున్నారు. రోజుకో ధర ఉంటోంది. ధరలకు స్వేచ్ఛనివ్వడంతో ఎప్పుడూ ఏ ధర ఉంటుందో తెలియడం లేదు. పెట్రోల్ కూడా సెంచరీ మార్క్ దాటేసి చాలా రోజులైంది. ప్రస్తుతం రూ.120కి చేరువలో ఉంది. కేంద్ర ప్రభుత్వం తమ నడ్డి విరుస్తోందని ప్రజలు వాపోతున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తమపై గుదిబండ మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ధరల పెంపుపై కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మోదీ పాలనతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని మండిపడుతున్నాయి. కార్పొరేట్ల సేవలో మునిగి తేలుతున్న మోదీ ప్రజలపై మాత్రం మోయలేని భారం మోపుతున్నారని విమర్శిస్తున్నాయి. బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంటున్నాయి. కాగా ఈ ధరల పెంపుపై ఆయా పార్టీలు ఉద్యమానికి పిలుపునిచ్చే అవకాశం ఉంది.