Rashmika: హీటెక్కించి.. ‘గర్ల్ ఫ్రెండ్’గా మారిన రష్మిక!
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్డమ్ అందుకున్న రష్మిక.. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం థియేటర్లో రన్ అవుతున్న అనిమల్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్‌గా మారిపోయింది.
Four People Arrested In Actress Rashmika Mandanna Deepfake Video Case
ఈ మధ్య డీప్ ఫేక్ వీడియోతో హాట్ టాపిక్ అయింది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. అయితే యానిమల్ సినిమాలో మాత్రం ఆ డీప్ ఫేక్ వీడియో కన్నా హాట్‌గా కనిపించింది రష్మిక. రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్.. డిసెంబర్ 1న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక, రణబీర్‌తో కలిసి లిప్ లాక్, రొమాన్స్‌తో రెచ్చిపోయింది. ముఖ్యంగా రణబీర్ ముందు డ్రెస్ తీసే సీన్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే అది సినిమా కాబట్టి.. కథకనుణంగా నటించింది రష్మిక. అయినా రష్మిక హాట్ లుక్ మాత్రం సోషల్ మీడియాను హీటెక్కించింది.
ఇదిలా ఉంటే యానిమల్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న రష్మిక.. ఏ మాత్రం గ్యాప్ లేకుండా గర్ల్‌ఫ్రెండ్‌గా మారిపోయింది. ప్రస్తుతం కన్నడ బ్యూటీ రష్మిక మందన్న చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. యానిమల్, పుష్ప2 లాంటి పాన్ ఇండియా సినిమాలతో పాటు.. ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలను కూడా చేస్తుంది. ఇప్పటికే ‘రేయిన్బో’ అనే ప్రాజెక్ట్ ప్రకటించింది. అలాగే గీతా ఆర్ట్స్ బ్యానర్లో ‘గర్ల్ ఫ్రెండ్’ అనే సినిమా కూడా చేస్తోంది. ఈ మూవీని రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు.
రీసెంట్‌గానే ‘గర్ల్ ఫ్రెండ్’ పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. యానిమల్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉండడం వల్ల.. పూజకు హాజరు కాలేదు రష్మిక. అయితే ఇప్పుడు ఫ్రీ అయిపోయింది కాబట్టి.. గర్ల్ ఫ్రెండ్ షూటింగ్లో జాయిన్ అయింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. ‘ది గర్ల్ ఫ్రెండ్’ రెగ్యులర్ షూటింగ్‌ను డిసెంబర్ 5న హైదరాబాద్ సిటీ శివార్లలోని షామీర్ పేటలో మొదలు పెట్టారు. రష్మికతో పాటు ఇతర క్యాస్టింగ్ మీద కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఏదేమైనా రష్మిక మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతోంది.