Minister Kakani : పవన్ ఓ జోకర్… మంత్రి కాకాణి షాకింగ్ కామెంట్స్..!
Minister Kakani : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి కాకాణి గోవర్థన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ ఓ జోకర్ అని ఆయన పేర్కొనడం గమనార్హం. పవన్ గురించి మాట్లాడితే తమకే అవమానమని ఆయన అభిప్రాయపడ్డారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి కాకాణి గోవర్థన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ ఓ జోకర్ అని ఆయన పేర్కొనడం గమనార్హం. పవన్ గురించి మాట్లాడితే తమకే అవమానమని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్యాకేజీలు చెల్లిస్తే కలిసే పార్టీ వైసీపీ కాదని, 5 ఏళ్ళ పాటు పాలించిన చంద్రబాబు ను ప్రజలు తిరస్కరించారని, ప్రజల్లో ఆయనకు విశ్వసనీయత లేదన్నారు. కేవలం ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఉందా అని మాత్రమే ప్రశ్నిస్తున్నామని, పవన్ కళ్యాణ్ ను , ఆయన పార్టీని అసలు రాజకీయ పార్టీగానే గుర్తించడం లేదన్నారు. పవన్ ను గురించి మాట్లాడితే తమకు అవమానం అన్నారు. పవన్ కళ్యాణ్ స్థాయి తోలుబొమ్మలాట లో జోకర్ మాత్రమే అన్నారు. ముఖ్యమంత్రి తెనాలికి హెలికాప్టర్ లో వెళ్ళే అంశాన్ని కూడా ప్రతిపక్షాలు నిర్దేశిస్తాయా అని మంత్రి కాకాణి ప్రశ్నించారు.
నారా లోకేష్ చేపడుతున్న యువ గళం పాదయాత్ర కు జనాదరణ లేదని, వైయస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ ఆర్థిక సాయం తో పాటు, మాందోస్ తుపాను పంట నష్ట పరిహారం చెల్లించామన్నారు. వైసిపి నమ్ముకున్నది ప్రజలను మాత్రమేనని, ఇతర పార్టీలతో పొత్తులు మాకు అవసరం లేదని మంత్రి కాకాణి చెప్పారు.