BHNG: గోదావరి డ్రింకింగ్ వాటర్ ఫేజ్-1లో మరమ్మతుల కారణంగా నేడు, రేపు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని మిషన్ భగీరథ కార్యనిర్వాహక ఇంజనీర్ పి.కరుణాకర్ తెలిపారు. భువనగిరి, బీబీనగర్, వలిగొండ, రామన్నపేట, పోచంపల్లి మున్సిపాలిటీలతో పాటు ఆలేరు నియోజకవర్గంలోని పలు మండలాలకు అంతరాయం ఏర్పడుతుందన్నారు.