MHBD: డోర్నకల్ ఎమ్మెల్యే డా.రాంచందర్ నాయక్ ఆదేశాల మేరకు పెద్ద ముప్పారం రైతు వేదికలో యూరియా పంపిణీ ఏర్పాట్లను PACS ఛైర్మన్ సంపేట రాము గౌడ్, AEO ఉదయకిరణ్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల అవసరాలకు అనుగుణంగా సరఫరా ఉండేలా చర్యలు చేపడతామని, బ్లాక్ మార్కెట్ ఆరికట్టడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు నవీన్ రెడ్డి, హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.